AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్ దెబ్బకు చీలిపోయిన అన్నాడీఎంకే .. పళనిస్వామికి బిగ్ షాక్.. టీవీకేకు జై కొట్టిన 30మంది ఎమ్మెల్యేలు..

తమిళనాడు రాజకీయాల్లో క్లైమాక్స్ సీన్ మొదలైంది.. దళపతి విజయ్ దెబ్బకు అన్నాడీఎంకే కోట బద్దలైంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ ప్రభంజనం సృష్టించడమే కాకుండా, ఇప్పుడు ప్రతిపక్షాన్ని నిలువునా చీల్చేశారు. సీనియర్ నేత సి.వి. షణ్ముగం నేతృత్వంలో 30 మంది ఎమ్మెల్యేలు పలనీస్వామికి షాక్ ఇచ్చి.. సీఎం విజయ్ చెంతకు చేరుతున్నారు.

విజయ్ దెబ్బకు చీలిపోయిన అన్నాడీఎంకే .. పళనిస్వామికి బిగ్ షాక్.. టీవీకేకు జై కొట్టిన 30మంది ఎమ్మెల్యేలు..
Aiadmk Cv Shanmugam Faction Announces Support To Tvk
Ch Murali
| Edited By: |

Updated on: May 12, 2026 | 10:52 AM

Share

తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇన్నాళ్లూ డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య సాగిన ద్విముఖ పోరుకు చెక్ పెడుతూ.. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభంజనం సృష్టించింది. అయితే ఎన్నికల ఫలితాల కంటే కూడా ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు అరవ రాజకీయాలను రసవత్తరంగా మార్చాయి. ముఖ్యంగా అన్నాడీఎంకేలో మొదలైన ముసలం ఆ పార్టీ అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తోంది. తాజాగా అన్నాడీఎంకే సీనియర్ నేత షణ్ముగం వర్గం సీఎం విజయ్‌కు జై కొట్టారు. మంగళవారం సాయంత్రం వారంతా విజయ్‌ను కలిసే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలకు అద్దం పట్టింది. మాజీ సీఎం, పార్టీ అధినేత పళనిస్వామి ఒక వర్గంతో అసెంబ్లీలోకి ప్రవేశించగా.. పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సి.వి. షణ్ముగం మరో వర్గంతో విడిగా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శాసనసభా పక్ష నాయకుడిగా పళనిస్వామికి కేవలం 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు పలికారు. ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు ఈపీఎస్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ షణ్ముగం వైపు నిలబడటం గమనార్హం.

పళనిస్వామి వైఫల్యమే కొంపముంచిందా?

పార్టీలో మెజారిటీ నాయకులు ఈపీఎస్ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వర్గాన్ని దూరం పెట్టడం, పొత్తుల విషయంలో పళనిస్వామి మొండి వైఖరి వల్లే పార్టీ మూడో స్థానానికి పడిపోయిందని ఎమ్మెల్యేలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన పార్టీ.. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదాను కూడా కాపాడుకోలేని స్థితికి చేరడంపై క్యాడర్ రగిలిపోతోంది.

తొలుత మద్ధతు.. ఆ తర్వాత..

ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ టీవీకే పార్టీ, తొలుత మ్యాజిక్ ఫిగర్ కోసం ఇబ్బంది పడింది. ఆ సమయంలోనే అన్నాడీఎంకే నుంచి సుమారు 25 నుండి 30 మంది ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ డీఎంకే మద్దతుతో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామంటూ పళనిస్వామి వ్యూహాత్మకంగా మైండ్ గేమ్ ఆడటంతో అప్పట్లో ఆ ప్రయత్నం ఆగింది. అయితే చివరకు కాంగ్రెస్, వామపక్షాలు, విసికే మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు మళ్లీ అన్నాడీఎంకేలోని అసంతృప్త ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తుండటం విశేషం. దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం తమిళనాడులోని పాత తరం రాజకీయాలకు సమాధి కడుతోందా..? పళని స్వామి తన పట్టును కాపాడుకుంటారా? లేక అన్నాడీఎంకే చరిత్రలో కలిసిపోతుందా..?  అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

Follow Us
విజయ్ దెబ్బకు చీలిపోయిన అన్నాడీఎంకే .. పళనిస్వామికి బిగ్ షాక్..
విజయ్ దెబ్బకు చీలిపోయిన అన్నాడీఎంకే .. పళనిస్వామికి బిగ్ షాక్..
ఫ్రెండ్‌ పార్టీకి పిలిచాడని వెళ్లాడు..కట్‌చేస్తే.. ఫుల్‌గా తాగాకా
ఫ్రెండ్‌ పార్టీకి పిలిచాడని వెళ్లాడు..కట్‌చేస్తే.. ఫుల్‌గా తాగాకా
చెత్తలో పడేయాలనుకున్న కారు..చివరికి రూ.47 లక్షల అదృష్టం తెచ్చింది
చెత్తలో పడేయాలనుకున్న కారు..చివరికి రూ.47 లక్షల అదృష్టం తెచ్చింది
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్..ఇంట్లో రాగితో చేసుకునేహెల్దీ టిఫిన్స్ఇవే
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్..ఇంట్లో రాగితో చేసుకునేహెల్దీ టిఫిన్స్ఇవే
సీఎస్కే పరిస్థితి అగమ్యగోచరం.. మరి రాజస్థాన్ రాయల్స్‌ పరిస్థితి ?
సీఎస్కే పరిస్థితి అగమ్యగోచరం.. మరి రాజస్థాన్ రాయల్స్‌ పరిస్థితి ?
ఫీల్ యువర్ లవ్..మీరు ఎంచుకునే హార్ట్ సింబలే మీ ప్రేమను తెలుపుతది
ఫీల్ యువర్ లవ్..మీరు ఎంచుకునే హార్ట్ సింబలే మీ ప్రేమను తెలుపుతది
సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు.. అసలు ఏం జరిగిందంటే?
సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు.. అసలు ఏం జరిగిందంటే?
ఆయన ముందు నిలబడాలన్నా చాలా సిగ్గుపడేదాన్ని
ఆయన ముందు నిలబడాలన్నా చాలా సిగ్గుపడేదాన్ని
అది ఫ్లైట్‌ కాదు భయ్యా ఆటో.. ట్రెండింగ్‌లోకి యువతి వీడియో
అది ఫ్లైట్‌ కాదు భయ్యా ఆటో.. ట్రెండింగ్‌లోకి యువతి వీడియో
టెంపుల్ సిటీలో కలర్ ఫుల్ ఈవెంట్..జాతరలో జంబలకడిపంబ!
టెంపుల్ సిటీలో కలర్ ఫుల్ ఈవెంట్..జాతరలో జంబలకడిపంబ!