Air India Plane Crash: ప్రమాద సమయంలో విమానం ఎంత వేగంగా వెళ్లిందో తెల్సా.? షాకింగ్ నిజాలు

ఎయిర్‌ ఇండియా విమానం అహ్మదాబాద్‌లోని BJ మెడికల్‌ కాలేజ్‌ భవనంపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా డాక్టర్లు చనిపోయినట్టు చెబుతున్నారు అధికారులు. హాస్పిటల్‌ హాస్టల్‌ బిల్డింగ్‌పై విమానం కూలిపోయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Air India Plane Crash: ప్రమాద సమయంలో విమానం ఎంత వేగంగా వెళ్లిందో తెల్సా.? షాకింగ్ నిజాలు
Ahmedabad Plane Crash

Updated on: Jun 12, 2025 | 4:33 PM

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఏఐసీ 171 బోయింగ్ 787-800 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన వెంటనే 625 అడుగుల ఎత్తులో, 174 నాట్ల వేగంతో, నిమిషానికి 896 అడుగుల ఎత్తులో ప్రయాణించిందని తెలుస్తోంది. ఎయిర్ పోర్టులో టేకాఫ్ అవుతూ 200 ఫీట్ల ఎత్తుకెళ్లిన విమానం.. ఆపై 625 ఫీట్లకు చేరిన తర్వాత నియంత్రణ కోల్పోయి కుప్పకూలినట్టు సమాచారం. టేకాఫ్ అయిన తర్వాత విమానం గాల్లో 5 నిమిషాల పాటు ప్రయాణించిందట. అటు విమానంలో 242మంది ప్రయాణికులు, 12మంది సిబ్బంది ఉన్నారు.

పైలట్‌కు 8,200 గంటల అనుభవం..

అహ్మదాబాద్ లో నేలకూలిన విమానాన్ని కెప్టెన్ సుమిత్ సభర్వాల్ నడిపినట్టు డీజీసీఏ వెల్లడించింది. ఆయనకు 8200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉంది. అలాగే కోపైలట్‌కు 1100 గంటలు విమానం నడిపిన అనుభవం ఉంది. అహ్మదాబాద్‌లో మధ్యాహ్నం 1.39 నిమిషాలకు, రన్‌ వే 23 నుంచి విమానం టేకాఫ్ అయింది. టేకాఫ్‌ కాగానే సాంకేతిక లోపం ఉన్నట్టు ఏటీసీకి MAYDAYకాల్‌… MAYDAY కాల్‌ వెళ్లింది. అయితే, ఆ కాల్‌ తర్వాత విమాన సిబ్బంది నుంచి ఏటీసీకి రెస్పాన్స్‌ రాలేదు. ఎయిర్‌పోర్టుకు కొద్దిదూరంలోనే విమానం కుప్పకూలింది. ప్రమాదానికి సాంకేతిక సమస్యలే కారణంగా DGCA భావిస్తోంది.