Yogi Adityanath: యూపీ విజయంతో బీజేపీలో మరింత బలమైన నేతగా సీఎం యోగి.. 2024 ఎన్నికల్లో తురుపుముక్క ఆయనేనట..!

|

Apr 14, 2022 | 2:10 PM

BJP Parliamentary Board - CM Yogi: ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మార్క్‌ స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో సీఎం యోగి తీసుకున్న సంచలన నిర్ణయాలు.. అదేవిధంగా పాలనాపరమైనటువంటి చర్యలు అందరిదృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Yogi Adityanath: యూపీ విజయంతో బీజేపీలో మరింత బలమైన నేతగా సీఎం యోగి.. 2024 ఎన్నికల్లో తురుపుముక్క ఆయనేనట..!
Follow us on

BJP Parliamentary Board – CM Yogi: ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మార్క్‌ స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో సీఎం యోగి తీసుకున్న సంచలన నిర్ణయాలు.. అదేవిధంగా పాలనాపరమైనటువంటి చర్యలు అందరిదృష్టిని ఆకర్షిస్తున్నాయి. యూపీలో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి దేశ రాజకీయాల్లో యోగి (Yogi Adityanath) చరిష్మా మరింత పెరిగింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు మార్గం సుగమం అయింది. భారతీయ జనతా పార్టీ.. అగ్ర నాయకత్వం పార్లమెంటరీ బోర్డులో ఆయన అడుగు పెట్టే తరుణం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు.. గుజరాత్ మోడల్‌గా చూపించిన బీజేపీ.. నేడు యూపీ మోడల్‌ను 2024 ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మార్చుకునేందుకు ప్రణాళికలు చేస్తోంది. 11 మంది సభ్యుల పార్లమెంటరీ ప్యానెల్‌లో యోగి ప్రవేశం దాదాపు పూర్తయినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. పార్టీ అగ్రనాయకత్వం ఉన్న పార్లమెంటరీ బోర్డులో ప్రస్తుతం నాలుగు ఖాళీలు ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న ఆరుగురు సభ్యుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఉన్నారు. చౌహాన్ 2014లో జాతీయ బాడీలోకి ప్రవేశించారు. కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్‌ల మరణం, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టడం, థావర్‌చంద్ గెహ్లాట్.. ఎంపీ పదవీ విరమణ వంటి కారణాలతో ఏర్పడిన నాలుగు ఖాళీలను భర్తీ చేసేందుకు బీజేపీ నాయకత్వం చాలా కాలంగా చరిష్మా.. ఉన్న నాయకుల కోసం అన్వేషణ కొనసాగిస్తూ వస్తోంది.

యోగికి జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో.. సీఎం ఇద్దరు డిప్యూటీలతో పాటు, కేశవ్ ప్రసాద్ మౌరీ, బ్రజేష్ పాఠక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థ) సునీల్ బన్సాల్ ఢిల్లీలో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. రాబోయే 100 రోజుల కోసం ప్లాన్ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు యోగి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా మారిన స్వతంత్ర దేవ్ సింగ్ స్థానంలో తదుపరి యూపీ బీజేపీ అధ్యక్షుడి పేరును ఖరారు చేయాలని కూడా వారు భావిస్తున్నారు.

ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, స్మృతి ఇరానీ, భూపేంద్ర యాదవ్‌ పేర్లు బీజేపీ అధిష్టానానికి వచ్చే అవకాశం ఉందని వ్యాసకర్త ఎం హసన్ పేర్కొన్నారు. ఆయన న్యూస్9కు రాసిన వ్యాసంలో పలు విషయాలను పంచుకున్నారు.

యూపీ మాదిరిగానే బీజేపీ.. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం మోదీ-యోగి డెవలప్‌మెంట్ ప్లాన్.. హార్డ్‌కోర్ హిందుత్వ ప్రచారాన్ని ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉందని ఎం హసన్ పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ “యూపీ ప్లస్ – యోగి బహుత్ హై ఉపయోగి” (యూపీలో మరోసారి యోగి అధికారంలోకి రావడం చాలా ప్రయోజనకరం) అనే నినాదంతో ప్రచారం చేశారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత యోగి చేసిన మంచి పనులను హైలైట్ చేసేలా ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇది ఇప్పుడు బీజేపీ జాతీయ రాజకీయాల్లో.. ముఖ్యంగా కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ముఖ్యమైన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది. యూపీలో యోగి గెలవకపోతే 2024లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోలేమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఎన్నికల ర్యాలీలో ప్రస్తావించారు. మోడీ-యోగి కలయిక అభివృద్ధి రాజకీయాలకు – హార్డ్ కోర్ హిందుత్వకు మార్గం సుగమం చేస్తుంది. కాబట్టి లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రణాళికలో ఇది సరిగ్గా సరిపోతుంది.

యోపీ మోడల్.. 

2014లో బీజేపీ ప్రచారం చేసిన గుజరాత్ మోడల్ నుంచి.. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, 2022 సార్వత్రిక ఎన్నికలలో యోగి “కఠినమైన పాలన” నమూనాను ప్రచారం చేయడానికి ఇప్పుడు ప్రణాళికలు జరుగుతున్నాయి. యోగి బుల్డోజర్ ఈ రోజుల్లో నేరస్థులకే కాకుండా రాష్ట్రంలోని అవినీతి అధికారులు.. పోలీసుల అక్రమ ఆస్తులను కూల్చివేయడానికి కూడా ఓవర్ టైం పని చేస్తోంది. ఇటీవల.. అక్రమ ఆస్తులను వేగంగా తొలగించడానికి ప్రభుత్వ సంస్థలు కూడా బోల్డోజర్లను ఉపయోగిస్తున్నాయి. ఇప్పటికే యోగి బుల్డోజర్ రాజకీయాలు మధ్యప్రదేశ్‌లో ప్రతిధ్వనించాయి. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి మాఫియా, గ్యాంగ్‌స్టర్‌లకు వ్యతిరేకంగా ప్రభుత్వం విస్తృతమైన డ్రైవ్‌ను కూడా ప్రారంభించింది.

లక్ష్యం లేని మంత్రులకు.. యోగి వార్నింగ్

కొత్తగా చేరిన మంత్రులు తమకు ఇచ్చిన 100 రోజుల పరిమిత కాల వ్యవధిలో తమ సామర్థ్యం మేరకు పని చేయాలని ఇప్పటికే పార్టీ కోరింది. 100 రోజుల లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించగానే.. మంత్రులు ఇప్పటికే ముఖ్యమంత్రి ఎదుట తమ ప్రజెంటేషన్‌లను అందించారు. ఇప్పుడు వారి లక్ష్యాలను సాధించడానికి ముందుకు సాగుతున్నారు.

స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సకాలంలో సాధించాలని.. నెల నెలా రిపోర్టులు కూడా ఇవ్వాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ వారికి దిశానిర్దేశం చేశారు. దీంతో మంత్రులు తమ స్థానాలను కాపాడుకునేందుకు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. సీఎం ఆదేశాలు ఎలా ఉన్నాయంటే.. రాష్ట్రాన్ని విడిచిపెట్టే ముందు వారు ముందుగానే ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది.

మంత్రుల దుబారా ఖర్చులను అరికట్టడానికి ముఖ్యమంత్రి కొన్ని పొదుపు చర్యలను కూడా చేపట్టారు. శాఖాపరమైన వ్యవహారాల్లో పారదర్శకతను నిర్ధారించడానికి తనిఖీలు, పనితీరును పర్యవేక్షించనున్నారు.

Also Read:

PM Narendra Modi: ఏలూరు ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని మోడీ విచారం.. మృతుల కుటుంబాలకు సంతాపం

Exams: పుస్తకం పట్టగానే కునుకుతీస్తున్నారా..? ఈ సింపుల్ టిప్స్‌తో ఏకాగ్రతను పెంచుకోండి