Thiruvananthapuram: 40 గంటలు తిండీ లేదు.. నీళ్లు లేవు. కన్నురెప్ప వేసి కనుకుతీస్తే చచ్చిపోతామనే భయం. బతుకాలనే ఆశ.. బతికిస్తామనే మాట. ఇదీ కేరళ(Kerala)లోని పాలక్కడ్ జిల్లా(Palakkad district )లో ఓ ట్రెక్కర్ పరిస్థితి. చావు బతుకుల మధ్య ఇరుక్కున్న అతన్ని కాపాడ్డానికి గతంలో ఎన్నడూ చూడని, ఇకపై చూడలేనంత ఓ భారీ రెస్యూ జరిగింది. అవును, బాబు బతికి బయటపడ్డాడు. చావుకు, బతుక్కి మధ్య 40గంటలపాటు గడిపాడు అతను. వెయ్యి అడుగుల ఓ కొండపై నుంచి జారి… పై నుంచి 4వందల అడుగుల్లో చిక్కుకున్నాడు. జారి పడ్డాక కిందకు 6వందల అడుగుల పాతాళం. ప్రాణాలు మిగులుతాయన్న గ్యారెంటీ లేదు. లోకల్స్, రెవిన్యూ టీమ్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఆర్మీ, కోస్ట్‌గార్డ్, ఎయిర్‌ఫోర్స్ ఒక్కరేంటి.. వందలాది మంది ప్రయత్నించారు. గ్యారెంటీ లేదు.. ఇక కష్టమే అనుకున్న టైమ్‌లో ఎట్టకేలకు బాబు బతికి బయటపడ్డాడు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ టీమ్ అతన్ని క్షేమంగా నేలపైకి తీసుకురాగలిగింది.
Good news! Trekker Babu who fell into a hill cleft in Kerala’s Palakkad district while hiking on Monday, stranding him for 2 days, has just been rescued by an Army team. ???? pic.twitter.com/CAh8W8iicw
— Shiv Aroor (@ShivAroor) February 9, 2022
మలమ్‌పుజాలో ఉండే బాబు అనే వ్యక్తి.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఈనెల 7న అంటే సోమవారం కురుంబాచి అనే కొండపైకి ట్రెక్కింగ్‌కి వెళ్లాడు. వెళ్లడం వరకూ చాలా జోష్‌గానే వెళ్లారు. తిరిగి వచ్చే టైమ్‌లో కాలు స్లిప్లై బాబు కొండపై నుంచి జరజరా జారాడు. నిజానికి.. ఇక అతను బతికి ఉండే చాన్స్ లేదనుకున్నారంతా. కానీ.. లక్కీగా పూర్తిగా నేలపై పడకుండా.. పై నుంచి 4వందల అడుగుల మేర జారిపడి.. కొండవాలుల్లో చిక్కుకున్నాడు. కొండపై నుంచి చూసిన స్నేహితులు చనిపోయాడని అనుకునేంతలో వాళ్ల ఫోన్‌కి ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను కొండ వాలుల్లో చిక్కుకున్నాను.. బతికే ఉన్నాను అని. వాట్సాప్‌లో లొకేషన్ కూడా పంపాడు. ఒక్కసారిగా తేరుకున్న ఆ ఇద్దరు ఫ్రెండ్స్ అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు గానీ.. ఎక్కడా సాధ్యం కాలేదు. వెంటనే మలమ్‌పుజాకు చేరుకుని అధికారులకు చెప్పారు. రెవిన్యూ టీమ్స్ వెంటనే అలర్ట్ అయ్యి అక్కడికి చేరుకున్నారు. కానీ.. బాధితులు చెప్పినంత సులువుగా లేదక్కడ పరిస్థితి. స్థానికులతో కలిసి కాపాడే ప్రయత్నం చేద్దామన్నా ఏ మాత్రం వీలు కాలేదు
రెవిన్యూ అధికారుల అలర్ట్‌తో స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్స్ కూడా వచ్చాయి. ఎవరికి వారు నడుచుకుంటూ కొండపైకి వెళ్లడమే కష్టం. అలాంటిది తాళ్లు, బ్యాగేజ్ వేసుకుని, అతను ఉన్న చోటికి నిట్టనిలువుగా వెళ్లడం అసాధ్యమైపోయింది.. సోమవారం మధ్యాహ్నం జారిపడిన బాబు.. మంగళవారం మధ్యాహ్నం వరకూ తనను కాపాడాలనుకుంటున్న వ్యక్తులకు సహకరించాడు. చేతులు ఊపుతూ, తాను బాగానే ఉన్నానన్న సంకేతాలు ఇస్తూ వచ్చాడు. కానీ నిన్న సాయంత్రానికి వీకైపోయాడు. తిండీ లేదు, నీళ్లులేవు. మనిషి పూర్తిగా డీహైడ్రేట్ అయిపోయి అచేతనమైపోయాడు. అయితే అప్పటికే అతని లొకేషన్ తెలిసింది కాబట్టి అతన్ని కాపాడేందుకు అనేక టీమ్స్ వరుస బెట్టి ప్రయత్నాలు చేస్తూనే వచ్చాయి.
మంగళవారం రాత్రి రెస్క్యూ టీమ్స్ పనిని ఆపేశాయి. ఆర్మీ హెలికాప్టర్లు ఆ ప్రాంతం చుట్టూ చక్కర్లు అయితే కొట్టగలిగాయి గానీ.. కనీసం నీళ్లు, తిండి కూడా అందించే వెసులుబాటు లేకపోయింది. ఎందుకుంటే హెలికాప్టర్ ఏమాత్రం కొండవాలుకు టచ్ అయినా.. అది మరో రకం ప్రమాదం అవుతుంది. మరోవైపు నుంచి కోస్ట్‌గార్డ్ టీమ్ కూడా ప్రాణాలకు తెగించినా ప్రయోజనం కనిపించలేదు.
అందరిలోనూ ఇక బాబును కాపాడడం అసాధ్యం అనే మాటలే వినిపించాయి. కేరళ సీఎం పినరయి విజయన్.. ఎయిర్‌ఫోర్స్‌ను రిక్వెస్ట్ చేశారు. విల్లింగ్టన్ ఎయిర్‌బేస్ అధికారులు, మౌంటేనీరింగ్ టీమ్.. ఈ ఉదయం హెలికాప్టర్లతో అక్కడికి చేరుకున్నాయి. ఎట్టకేలకు రెస్క్యూ జరిగింది. బాబు పునర్జన్మ పొందాడు. మృత్యువును జయించి.. బయట పడ్డాడు.
#WATCH | Babu, the youth trapped in a steep gorge in Malampuzha mountains in Palakkad Kerala extends his thanks to the Indian Army after being rescued. Teams of the Indian Army had undertaken the rescue operation.
(Video source: Indian Army) pic.twitter.com/VzFq6zSaY6
— ANI (@ANI) February 9, 2022
Also Read: Rs 10 coins: ‘అసలు రూ.10 కాయిన్స్ చెల్లుబాటులో ఉన్నాయా.. లేదా..?’.. ఇదిగో ఫుల్ క్లారిటీ