బీ అలర్ట్.. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు..

| Edited By:

Dec 19, 2019 | 5:37 AM

ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ – పాక్ సరిహద్దుల్లో ఏ క్షణం ఏమైనా జరగొచ్చని.. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందన్నారు. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. వాటిని ఎదుర్కొనేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉందని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన అనంతరం.. భారత్- పాక్‌ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి దేశంలో అలజడి సృష్టించేందుకు.. […]

బీ అలర్ట్.. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు..
Follow us on

ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ – పాక్ సరిహద్దుల్లో ఏ క్షణం ఏమైనా జరగొచ్చని.. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందన్నారు. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. వాటిని ఎదుర్కొనేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉందని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన అనంతరం.. భారత్- పాక్‌ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి దేశంలో అలజడి సృష్టించేందుకు.. ఉగ్రవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

గత కొద్ది రోజుల నుంచి పాక్ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. యథేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. సోమవారం రోజు కూడా పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. సుందర్ బని సెక్టార్‌లో కాల్పులు చేపట్టింది. ఈ ఘటనలో బారత్‌కు చెందిన ఓ జవాన్ అమరుడయ్యాడు. ప్రస్తుతం ఎల్‌ఓసీ వద్ద పరిస్థితులు.. వేగంగా మారే అవకాశం ఉందన్నారు. కాగా, ఇటీవల నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులపై కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్‌లో స్పందించారు. గత ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో పాక్ 950 సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.