
అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో స్పీడ్ పెంచింది. కీలక ప్రయోగాలతో ఇస్రో దూసుకెళ్తోంది. చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత..’ఆదిత్య హృదయాన్ని’ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. సూర్యగోళం రహస్యాలను ఛేదించడానికి.. శ్రీహరికోట వేదికగా రంగం సిద్ధమైంది. చంద్రయాన్-3 సక్సెస్‌తో.. భారత్ ను అగ్రరాజ్యాలకు దీటుగా నిలిపిన ఇస్రో.. తాజాగా ఆదిత్య-L1 ప్రయోగానికి సిద్ధమైంది. సెప్టెంబరు 2, ఉదయం 11.50 గంటలకు.. ఆదిత్య ఎల్-1 ప్రయోగానికి శ్రీహరికోటలోని షార్ కేంద్రం వేదికవుతోంది.
సూర్యుడి రహస్యాల గుట్టువిప్పడమే లక్ష్యంగా.. ఇస్రో ఆదిత్య-L1 ప్రయోగం చేపట్టింది. సూర్యుని అయస్కాంత క్షేత్రంలో సంభవించే మార్పులు.. కరోనియంలో ఉన్న పదార్థాలు.. సౌర తుఫానులను అధ్యయనం చేయడానికి.. భారత్ చేస్తున్న తొలి ప్రయోగం ఇది..
ఆగస్టు 28న, భారత పరిశోధనా సంస్థ (ఇస్రో) సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C57) ద్వారా భారత కాలమానం ప్రకారం ఉదయం 11:50 గంటలకు ఆదిత్య-ఎల్1ని ప్రయోగించనున్నట్లు తెలిపింది. మిషన్ ‘ఆదిత్య-ఎల్1’ పేరు దాని ఉద్దేశ్యాన్ని క్లుప్తంగా వెల్లడిస్తుంది. సూర్యుడికి ఆదిత్య అనే పేరు కూడా ఉంది. L1 అంటే – Lagrange point 1. ISRO ప్రకారం, L1 పాయింట్ దూరం భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ (15 లక్షలు) కిలోమీటర్లు. L1 పాయింట్ కరోనల్ కక్ష్యలో ఆదిత్య-L1 ఉంచడం ద్వారా సూర్యుని అధ్యయనం చేయబడుతుంది.
ఈ వ్యవస్థలో భూమి, సూర్యుడు, చంద్రునితో సహా ఐదు లాగ్రాంజ్ పాయింట్లు ఉన్నాయి. వాటికి ఇటాలియన్-ఫ్రెంచ్ గణిత శాస్త్రజ్ఞుడు జోసెఫ్ లూయిస్ లాగ్రాంజ్ పేరు పెట్టారు. సూర్యుడు, భూమి వంటి రెండు భారీ వస్తువుల గురుత్వాకర్షణ శక్తి కారణంగా అంతరిక్షంలో పార్కింగ్ లాట్ లాంటి ప్రాంతాలు అందుబాటులో ఉండే పాయింట్లు ఇవి.
మీరు సులభమైన మార్గంలో అర్థం చేసుకుంటే.. సూర్యుడు-భూమి గురుత్వాకర్షణ లాగ్రాంజ్ పాయింట్ వద్ద సమతుల్యంగా ఉంటుంది. తద్వారా ఎక్కువ కాలం పాటు ప్రయాణించేందుకు ఛాన్స్ ఉంటుంది. అందుకే లాంగ్రెస్ పాయింట్ 1లో దీన్ని నెలకొల్పేందుకు ఆదిత్య-ఎల్1ని ప్రయోగించనున్నారు. అక్కడి నుంచి సూర్యునిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి అధ్యయనం చేయడంతోపాటు స్థానిక వాతావరణం గురించిన సమాచారాన్ని సేకరిస్తుంది.
సూర్యునికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు భారతదేశం మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత సౌర మిషన్ ఆదిత్య-L1 ప్రయోగ తేదీ దగ్గరవుతున్నందున ప్రజలు దాని గురించి ఆసక్తిని కలిగి ఉన్నారు. భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసిన తర్వాత.. ఈ మిషన్ ఏం చేస్తుంది..? ఎలా అధ్యయనం చేస్తుందనే దానిపై ప్రపంచ దృష్టి ఉంది.
మరోవైపు చంద్రయాన్ -3 మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ల పరిశోధనా కాలంలో..ఇక ఆరు రోజులే మిగిలివున్నాయి. అంటే విక్రమ్-ప్రజ్ఞాన్ లకు దాదాపు 150 గంటలే మిగిలి ఉన్నాయన్నమాట! చంద్రుని దక్షిణ ధృవంలో.. ఆక్సిజన్, ఇతర మూలకాల ఉనికితోబాటు..ఉష్ణోగ్రతల్లో మార్పులను చంద్రయాన్-3 ఇప్పటికే గుర్తించింది. రాబోయే కొద్ది రోజుల్లో..చంద్రునిపై భూకంప సంబంధిత కార్యకలాపాలు, చంద్రుడు-భూమి మధ్య సిగ్నల్ దూరం..అక్కడి మట్టిలో కనుగొన్న కణాలపై పరిశోధన కొనసాగుతుంది.
🚀PSLV-C57/🛰️Aditya-L1 Mission:
The launch of Aditya-L1,
the first space-based Indian observatory to study the Sun ☀️, is scheduled for
🗓️September 2, 2023, at
🕛11:50 Hrs. IST from Sriharikota.Citizens are invited to witness the launch from the Launch View Gallery at… pic.twitter.com/bjhM5mZNrx
— ISRO (@isro) August 28, 2023
ఇదిలావుంటే, ఇస్రో సైంటిస్టులు ఎక్కడకు వెళ్లినా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణించిన ఇస్రో చీఫ్ సోమనాథ్‌ను..’నేషనల్ హీరో’ అంటూ తోటి ప్రయాణికులంతా అభినందలతో ముంచెత్తారు. ఇస్రో చైర్మన్‌ను స్వాగతించే అవకాశం లభించినందుకు గర్వపడుతున్నామంటూ..ఇండిగో స్టాఫ్ షేర్ చేసిన దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
మరన్ని జాతీయ వార్తల కోసం