WITT 2024: యానిమల్ విజయం ఆశ్చర్యాన్ని కలిగించింది.. టీవీ9 సమ్మిట్‌లో ఖుష్బూ

|

Feb 25, 2024 | 8:56 PM

టీవీ9 న్యూస్ నెట్‌వర్క్‌ 'వాట్ ఇండియా థింక్స్‌ టుడే' పేరుతో సమ్మిట్ నిర్వహిస్తోంది. రెండో ఎడిషన్‌ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన ఖుష్బూ యానిమల్‌ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ..

1 / 5
 దేశంలో నెంబర్‌ వన్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌ టీవీ9 ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ రెండో ఎడిషన్ ఆదివారం ప్రారంభమైంది. అతిథులకు ఆహ్వానం పలుకుతూ TV9 నెట్‌వర్క్ MD అండ్‌ CEO బరున్ దాస్ స్వాగతోపన్యాసంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమ్మిట్‌లో భాగంగా పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు పాల్గొన్నారు.

2 / 5
ఇందులో భాగంగా తొలిరోజు వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన ప్రముఖులను టీవీ9 నెట్ వర్క్ సత్కరించింది. సినీ రంగానికి చెందిన వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో నటి రవీనా టాండన్‏తో పాటు, ఖుష్బూ కూడా ఉన్నారు. రవీనా టాండన్‌కు నక్షత్ర సమ్మాన్ అవార్డుతో సత్కరించింది టీవీ9.

3 / 5
ఇక సీనియర్ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తల్లి పట్ల తన తండ్రి వ్యవహరించిన తీరును నటి మరోసారి గుర్తుచేసుకున్నారు. తన తల్లి పరిస్థితి చూసి ఎప్పుడూ నిస్సహాయురాలిగా మారకూడదని అనుకున్నానని తెలిపారు.

4 / 5
తమ తల్లి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని.. ఎప్పటికీ ఒక నిస్సహాయ మహిళగా మారకూడదని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల విడుదలైన యానిమల్‌ చిత్రంపై కూడా స్పందించారు నటి ఖుష్బూ.

5 / 5
యానిమల్ సినిమా విజయం కావడం ఇప్పటికీ తనకు ఆశ్చర్యంగానే ఉందని. ప్రజల ఆలోచనల గురించి మనం ఏమి చెప్పగలమన్న ఖుష్బూ.. యానిమల్ లాంటి సినిమాలను మళ్లీ మళ్లీ చూడడానికి ఇష్టపడుతున్నారు. సినీ ప్రేక్షకుల మనస్తత్వమే ఇప్పుడు సమస్య. సినిమాల్లో చూపించేవే సమాజంలో జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.