మరో దారుణం.. బాలికను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికిన యువకుడు

|

Apr 03, 2023 | 4:25 PM

ఇటీవల హత్యలు చేయడం.. వారి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో శ్రద్ధవాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.

మరో దారుణం.. బాలికను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికిన యువకుడు
Follow us on

ఇటీవల హత్యలు చేయడం.. వారి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో శ్రద్ధవాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇలాంటి ఘటనలే మరికొన్ని ప్రాంతాల్లో వెలుగుచూశాయి. ఇప్పుడు తాజాగా రాజాస్థాన్ లో అలాంటి ఘటనే చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. రాజాస్థాన్‎లోని ఉదయ్ పూర్‎లో ఓ 20 ఏళ్ల యువకుడు తొమ్మిదేళ్ల బాలికను హత్య చేసి ముక్కలుముక్కలుగా నరికేశాడు. ఆ తర్వాత వాటిని ఓ ప్లాస్టిక్ సంచుల్లో కుక్కి పాడుబడ్డ ఇంట్లో పారేశాడు. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగున ఉన్నవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు ఆ ఇంట్లో పరిశీలించగా వారికి శరీర భాగాలు లభించాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి కమ్లేశ్ అనే యువకుడ్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిందితుడు ఆ బాలికను హత్య చేసే ముందు అత్యాచారానికి పాల్పడి ఉండొచ్చన్న అంశాన్ని కొట్టిపారేయలేమన్నారు. అయితే గత నెల 29న ఓ బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలోనే గాలింపు చర్యలు చేపట్టగా ఆమె శరీర భాగాలు దొరికాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం

ఇవి కూడా చదవండి