సోషల్ మీడియా చాలా అద్బుతమైన ప్రపంచం. ఇందులో యాక్టివ్‌గా ఉన్నవారు వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో చాలా వీడియోలను చూస్తుంటారు. వీటిలో కొన్ని షాకింగ్ వీడియోలు, మరికొన్ని ఫన్నీ వీడియోలు ఉన్నాయి. కొన్నింటిలో అద్భుతమైన ట్రిక్స్ కనిపిస్తే కళ్లను నమ్మడం చాలా కష్టం. ప్రస్తుతం ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన తర్వాత అయోమయానికి గురవడం పక్కా. ప్రకృతిని చూసి అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ప్రకృతి తో వింతలు, విశేషాలకు కొదవ ఉండదు. సాధారణంగా మేకలు మేత మేసే సమయంలో వాటికి అందినంత ఎత్తులో ఉన్న ఆహారాన్ని తీసుకుంటాయి. కొన్ని సార్లు కాళ్లు పైకి ఎత్తి ఆహారాన్ని అందుకుంటాయి. అంతే కాకుండా కొన్ని స్టంట్స్, ట్రిక్స్ తో సులభంగా ఫుడ్ ను అందుకుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో మేక తాటి చెట్టు ఎక్కడాన్ని చూడవచ్చు. గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏ మేకకైనా ఇలా చేయడం కష్టం. కానీ ఈ మేక మాత్రం చాలా సులభంగా చెట్టు పైకి ఎక్కేసింది. ఎక్కువ శ్రమ పడకుండా తాటి చెట్టు ఎక్కి తేలికగా కిందకు దిగుతుండటాన్ని వీడియోలో చూడవచ్చు. ల్యాండింగ్ సమయంలోనూ మేక జారి కిందపడిపోతుందనుకోవచ్చు. కానీ తర్వాత సాఫీగా నడుస్తుంది. ఈ క్లిప్ చూశాక న్యూటన్ గురుత్వాకర్షణ సూత్రాన్ని పరీక్షించడానికే ఈ మేక చెట్టు ఎక్కినట్లు అనిపిస్తోంది.
Testing law of gravity… pic.twitter.com/VrzCPN7MQc
— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) November 24, 2022
ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సామ్రాట్ గౌడ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకు ఆరు వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు. వీడియోను చూసిన తర్వాత కళ్లను నమ్మడం చాలా కష్టం అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వీడియోను చూసిన తర్వాత తమకు తెలిసిన వారికి, బంధువులకు షేర్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం