Pregnant Women: ప్రసవం కోసం 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన నిండు గర్భిణి

మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడు తమ కుటుంబ సభ్యలు వాళ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అవసరమైనప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్తూ, కావాల్సిన ఆహారాన్ని వండిపెడుతూ.. ఆ గర్భవతులకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటారు.

Pregnant Women: ప్రసవం కోసం 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన నిండు గర్భిణి
Pregnant Woman

Updated on: Jul 02, 2023 | 7:08 PM

మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడు తమ కుటుంబ సభ్యలు వాళ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అవసరమైనప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్తూ, కావాల్సిన ఆహారాన్ని వండిపెడుతూ.. ఆ గర్భవతులకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటారు. ఇక ఆ మహిళ డెలివరీ అయ్యే సమయానికి జాగ్రత్తగా వాహనంలో తీసుకెళ్తారు. అయితే తమిళనాడులోని ఓ గర్భవతి మాత్రం డెలివరీ అయ్యేందుకు 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. దీనికి కారణం వారి ప్రాంతంలో సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడమే. ఇక వివరాల్లోకి వెళ్తే వేలూర్ జిల్లాలోని ముచ్చన్ గ్రామంలో శివగామి(22) అనే మహిళ నిండు గర్భవతి.

అయితే శనివారం రోజున ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను చికిత్సకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైద్య కళాశాలకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కానీ వారి ఊరి నుంచి వైద్య కళాశాలకు వెళ్లడానికి అసలు సరైన రోడ్డే లేదు. అక్కడ వాహనాలు కూడా నడవవు. దీంతో ఇక చేసేదేమి లేక ఆ గర్భిణిని నడుచుకుంటూ తీసుకెళ్లారు. దాదాపు అలా 15 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆటోలో వైద్యకళాశాలకు చేరుకున్నారు. ఇక చివరకి ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..