
ప్రతీకారాలు కొందమందిని ఎంతదూరమైన తీసుకెళ్తాయి . ఓ వ్యక్తి తన పగను తీర్చుకునేందుకు జైల్లో ఉన్న వ్యక్తికి బెయిల్ ఇప్పించి మరీ హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్‌లోని ఖేరి జిల్లా మితౌలీ గ్రామంలో కాశీ కాశ్యప్(50) తన భార్య, కొడుకు జితేంద్ర(14) తో కలిసి ఉండేవాడు. అయితే 2020లో ఓ హత్య కేసులో కాశీ జైలుకెళ్లాడు. ఆ తర్వాత అతని భార్యకు సమీప బంధువైన శత్రుధన్ లాలా(47) అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. అయితే వీళ్లిద్దరు తమకు అడ్డుగా ఉన్న జీతేంద్రను హత్య చేశారు. దీంతో వీళ్లిద్దరూ జైలుపాలయ్యారు.
గత ఏడాది కాశీ జైలు నుంచి బయటకొచ్చాడు. కొడుకును హత్య చేసిన శత్రుధన్ లాలాపై పగతో రగలిపోయాడు.లాలాను ఎలాగైన బయటకు తీసుకొచ్చేలా చేయాలనుకున్నాడు. తన సొంత ఖర్చులతోనే ఓ లాయర్‌ను సంప్రదించి మరీ బెయిల్ పై లాలాను బయటకు తీసుకొచ్చాడు. శుక్రవారం రాత్రి అతడ్ని తుపాకితో కాల్చేశాడు. దీంతో శత్రుధన్ లాలా అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కాశీని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..