Viral News: ఎవరు ఎక్కువ చేపలు తింటే వారే విజేత.. 15 నిమిషాల్లో 75 ముక్కలు తినేశాడు..! బహుమతి ఎంతంటే..

ఇక 15 నిమిషాల్లో 60 చేప ముక్కల చొప్పున తిని రాజ్‌సాహ్ని, జైకుమార్‌ ఇద్దరూ మూడో స్థానం దక్కించుకున్నారు. వారికి రూ.2,500 చొప్పున ప్రైజ్‌మనీ అందించారు.

Viral News: ఎవరు ఎక్కువ చేపలు తింటే వారే విజేత..  15 నిమిషాల్లో 75 ముక్కలు తినేశాడు..! బహుమతి ఎంతంటే..
Eat Fish Competition

Updated on: Jan 10, 2023 | 9:06 PM

బీహార్ లోని పాట్నాలో ఓ వ్యక్తి 15 నిమిషాల్లో 75 చేప ముక్కలు తిని అందరిని అవ్వకయేలా చేసాడు. అంతే కాదు, దీనితో పాటుగా 10,000రూపాయల నగదు బహుమతి గెలుచుకున్నాడు. చేపల వ్యాపారాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా బీహార్ రాష్ట్ర ఫిషర్‌మెన్‌ల కోఆపరేటివ్‌ యూనియన్‌ ‘ఈట్‌ ఫిష్‌ గెట్‌ రివార్డెడ్‌’ పేరుతో చేప ముక్కలు తినే పోటీని నిర్వహించింది. ఈ పోటీలో పాల్గొన్న మదన్‌ అనే వ్యక్తి కేవలం 15 నిమిషాల వ్యవధిలో 75 చేప ముక్కలు తిని టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు.

‘ఈట్‌ ఫిష్‌ గెట్‌ రివార్డెడ్‌’ బహుమతిగా అతనికి రూ.10 వేల ప్రైజ్‌ మనీ దక్కింది. ఆ తర్వాత 15 నిమిషాల్లో 73 చేప ముక్కలు తిన్న పరాస్‌ రెండో స్థానంలో నిలిచి రూ.5 వేల నగదు బహుమతి గెలుచుకున్నాడు. ఇక 15 నిమిషాల్లో 60 చేప ముక్కల చొప్పున తిని రాజ్‌సాహ్ని, జైకుమార్‌ ఇద్దరూ మూడో స్థానం దక్కించుకున్నారు. వారికి రూ.2,500 చొప్పున ప్రైజ్‌మనీ అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us