ఇదెక్కడి జర్నీరా బాబు.. 45 నిమిషాల్లో వెళ్లే ప్రయాణానికి 225 నిమిషాలు పట్టింది..

ఒకప్పుడు ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలంటే చాలామంది బస్సులు, ఆటోలోపైనే వెళ్లేవారు. మరికొందరు సొంత వాహనాలపై వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో రాపిడో, ఒలా, లాంటి సదుపాయలు అందుబాటులోకి వచ్చాక చాలామంది వీటిపైనే ఆధారపడుతున్నారు. నగరంలో ఎక్కడికైన వెళ్లాలంటే వెంటనే ఆన్‌లైన్‌లో సొంతంగా వాహనాన్ని బుక్ చేసుకుంటున్నారు.

ఇదెక్కడి జర్నీరా బాబు.. 45 నిమిషాల్లో వెళ్లే ప్రయాణానికి 225 నిమిషాలు పట్టింది..
Auto

Updated on: Aug 02, 2023 | 5:15 PM

ఒకప్పుడు ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలంటే చాలామంది బస్సులు, ఆటోలోపైనే వెళ్లేవారు. మరికొందరు సొంత వాహనాలపై వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో రాపిడో, ఒలా, లాంటి సదుపాయలు అందుబాటులోకి వచ్చాక చాలామంది వీటిపైనే ఆధారపడుతున్నారు. నగరంలో ఎక్కడికైన వెళ్లాలంటే వెంటనే ఆన్‌లైన్‌లో సొంతంగా వాహనాన్ని బుక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాటిలో ఉండే సౌకర్యం పబ్లిక్ బస్సులు, షేర్ ఆటోల్లో ఉండదు. అందుకే చాలామంది నగరవాసులు లోకల్‌లో ఎక్కడికైనా వెళ్లాలంటే వీటిని ఎంచుకుంటున్నారు. అయితే బెంగళూరుకి చెందిన ఓ యువకుడు మాత్రం ఆన్‌లైన్‌లో బుక్ చేసిన వాహన ప్రయాణంలో కలిగే అసౌకర్యాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. తను వెళ్లాల్సిన గమ్యానికి 45 నిమిషాలు పడుతుందని.. కాని అతను ఏకంగా 225 నిమిషాలు ఎదురుచూడాల్సి వచ్చిందని చెప్పాడు.

సాధారణంగా ఆన్‌లైన్‌లో వాహనాన్ని బుక్ చేసుకునేటప్పుడు తొందరగా వచ్చే వాహనాలను ఎంచుకుని బుక్ చేసుకుంటారు. కానీ బెంగళూరులోని ఈ వ్యక్తికి మాత్రం చేదు అనుభవం అదురైంది. వివరాల్లోకి వెళ్తే అతను ఓ చోటుకి వెళ్లేందుకు ర్యాపిడోలో వాహనాన్ని బుక్ చేసుకున్నాడు. వాస్తవానికి అతని గమ్యస్థానం చేరుకునేందుకు పట్టే సమయం 45 నిమిషాలు. కానీ ర్యాపిడ్‌లో బుక్ చేసుకున్న వాహనంలో వెళ్తే ఏకంగా 225 నిమిషాలు వెయిటింగ్ చేయల్సి వచ్చింది. దీంతో విసుగు చెందిన ఆ యువకుడు అతనికి ఎదురైన ఈ అనుభవాన్ని మొబైల్‌లో స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. నెటిజన్లు విభిన్న రూపంలో కామెంట్లు ఇస్తున్నారు. అంతలా వెయిటింగ్ చేయాల్సిన సమయంలో ఓ సినిమా చూసి రావచ్చంటూ కామెంట్లు చేస్తున్నారు. బెంగళూరు అంటే ఐటీ హబ్ అని తెలిసిందే. అక్కడ ట్రాఫిక్‌ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటి ట్రాఫిక్‌లో ప్రయాణించాంటే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.

ఇవి కూడా చదవండి