అక్కడ దొంగలు కృష్ణుడిని తొలి గురువుగా భావిస్తారట! గోవర్ధనగిరి పూజలు చేస్తారట!

|

Nov 13, 2020 | 6:26 PM

దీపావళిని వేన వేల సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారని పురాణాలు చెబుతున్నా, చరిత్ర ఆధారాలను బట్టి చూస్తే ఈ పండుగను క్రీస్తుశకం మూడో శతాబ్దం నుంచి జరుపుకుంటున్నారని తెలుస్తోంది. విదేశీ యాత్రికులు కూడా దీపావళిని దేశవ్యాప్తంగా చేసుకుంటున్నారని తమ గ్రంధాలలో పేర్కొన్నారు. మొగల్‌ చక్రవర్తి అక్బర్‌ అయితే దీపావళిని ఘనంగా జరిపేవాడు. ఆ రోజున తన ఆస్థానంలో వున్నవారందరికీ కొత్త దుస్తులను బహూకరించేవాడు.. విందు భోజనాన్ని ఏర్పాటు చేసేవాడు. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో కూడా దీపావళి ఘనంగా జరుగుతోంది.. […]

అక్కడ దొంగలు కృష్ణుడిని తొలి గురువుగా భావిస్తారట! గోవర్ధనగిరి పూజలు చేస్తారట!
Follow us on

దీపావళిని వేన వేల సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారని పురాణాలు చెబుతున్నా, చరిత్ర ఆధారాలను బట్టి చూస్తే ఈ పండుగను క్రీస్తుశకం మూడో శతాబ్దం నుంచి జరుపుకుంటున్నారని తెలుస్తోంది. విదేశీ యాత్రికులు కూడా దీపావళిని దేశవ్యాప్తంగా చేసుకుంటున్నారని తమ గ్రంధాలలో పేర్కొన్నారు. మొగల్‌ చక్రవర్తి అక్బర్‌ అయితే దీపావళిని ఘనంగా జరిపేవాడు. ఆ రోజున తన ఆస్థానంలో వున్నవారందరికీ కొత్త దుస్తులను బహూకరించేవాడు.. విందు భోజనాన్ని ఏర్పాటు చేసేవాడు. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో కూడా దీపావళి ఘనంగా జరుగుతోంది.. పంజాబ్‌లో సిక్కులు దీపావళిని అంగరంగవైభవంగా జరుపుకుంటారు. సిక్కు గురువు హరిగోవింద్‌ సింగ్‌ మొగల్‌ పాలకుల చెర నుంచి దీపావళి రోజే విడుదలయ్యారు. ఆ కారణంగా సిక్కులు దీపావళిని పవిత్రమైన రోజుగా భావిస్తారు. స్వర్ణ దేవాలయాన్ని రంగు రంగుల దీపాలతో అలంకరిస్తారు. జైన మత వ్యవస్థాపకుడు మహావీరుడు దీపావళి రోజు నిర్యాణం చెందాడు. అందుకే దీపావళి వాళ్లకి పవిత్రమైన రోజు. బెంగాలీలు..ఒరియా ప్రజలు పండుగ రోజు కాళీమాతను పూజిస్తారు. తమిళనాడులో అన్నదమ్ములు తమ తోబుట్టువులను పుట్టింటికి పిలిచి చీరలు సారెలు కానుకగా ఇస్తారు. రాజస్తాన్‌లో దీపావళి రోజున అగ్ని పూజ చేస్తారు. దీన్నే వారు హిచ్‌ అంటారు. హిచ్‌ అంటే మట్టి కుంపటి. మగవారు ఈ కుంపటిని వెలిగించి ఊరంతా తిప్పుతారు. ఉత్తర కర్ణాటకలో దీపావళి రోజున దీపాలను వెలిగించి పశువుల ఎదురుగా పెడతారు. దీన్ని వారు ఆణీ-పేణీ అంటారు. ఈ విధంగా చేయడం వల్ల పశువులు ఆరోగ్యంగా వుంటాయని, పశు సంపద పెరుగుతుందని నమ్మకం. మహారాష్ర్టలో పండుగకు మరో విశేషముంది. అక్కడ దొంగలు శ్రీ కృష్ణుడిని ఆరాధిస్తారు.. వెన్నదొంగ అయిన కృష్ణుడిని వారు తొలి గురువుగా భావిస్తారు. అంతే కాదు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినది కూడా దీపావళినాడేనట! అందుకే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గోవర్ధన పూజను కూడా చేస్తారు. ఒక్క భారతదేశంలోనే కాదు…ప్రపంచంలోని చాలా దేశాలు దీపావళిని జరుపుకుంటారు. బర్మాలో దీపావళిని తంగీజు అంటారు. జ్ఞానోదయమైన బుద్ధుడు తంగీజు రోజే భూమ్మీదకు వచ్చాడని వారి నమ్మకం. నేపాల్‌లో పంచక్‌ అంటారు.. దీన్ని అయిదు రోజుల పాటు చేసుకుంటారు. దీపావళి అంటే కేవలం ఒక్క సంఘటనతో ముడిపడి వున్న పండుగే కాదు. దాదాపు పురాణ కథలన్నీ దీపావళితో ముడిపడి వున్నాయంటే అతిశయోక్తి కాదు..

ఎంతటి ధనవంతులైనా మణిమయరత్న భూషణాలను దానంగా ఇస్తారు. ధన ధాన్య వస్తు వాహనాలను ఎడమచేతితో వదిలేస్తుంటారు. అంతెందుకూ ఈ గడ్డ మీద రాజ్యాలనే తృణప్రాయంగా వదిలేసుకున్న రాజులు కూడా ఉన్నారు. కానీ, ఎవరైనా తనకు తాను అర్పణం చేసుకుంటారా? అలా చేసుకున్న వాడే బలి చక్రవర్తి. ఐశ్వర్యమూర్తి మహాలక్ష్మీదేవిని ఆ చేతులు తడిమాయనీ… అంతటి చేతులు తన చేతి కిందకు చేరాయనీ అంతకన్నా ఏం కావాలంటూ తనకు తాను వామనావతారంలో వచ్చిన మహావిష్ణువుకు దానమిచ్చుకుంటాడు బలి చక్రవర్తి. అంతే పాతాళానికి చేరుకుంటాడు. అతని దాన నిరతికి మెచ్చిన ఆ నారాయణుడు వరమొకటి ఇస్తాడు. ఏడాదికో పాడ్యమినాడు పాతాళలోకం నుంచి వచ్చి భూమిని పాలించుకోవచ్చంటాడు శ్రీహరి. ఆ పాడ్యమే బలిపాడ్యమి అయింది.

ఉత్తరాదిన దీపావళి వేడుకల్లోనే ఓ పండుగ చేసుకుంటారు..
అఖరుగా ఓ వింత పండుగ జరుపుకుంటారు.. ఇది రాఖీ పండుగను తలపిస్తుంది.. దీనిని భ్రాతృ ద్వితీయ లేక యమ ద్వితీయ అంటారు. ఆ రోజున అన్నదమ్ములు అక్క చెళ్లిళ్ల ఇళ్లకు వెళ్లి వాళ్లు చేసిన వంటకాలను కడుపారా ఆరగిస్తారు.. అందుకే దీన్ని భాగినీ హస్త భోజనం అంటారు. అంటే తోబుట్టువు చేతి వంట తినే రోజున్నమాట.. ఆ వంట నోరారా హాయిగా తిని చేతులారా అక్కచెల్లెళ్లకు కానుకలిచ్చి వస్తారు అన్నదమ్ములు.