Shabnam case: డబుల్ ఎంఏ చదివి, ఆరో తరగతి డ్రాపౌట్ అయిన యువకుడితో అక్రమ సంబంధం, ఎవరీ షబ్నమ్ ?

Shabnam case: షబ్నమ్..ఇన్నేళ్లకు మళ్ళీ ఈ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎవరీమె ? తన కుటుంబంలో ఏడుగురు సభ్యులను తన ప్రియుడు సలీం సాయంతో దారుణంగా చంపిన..

Shabnam case: డబుల్ ఎంఏ చదివి,  ఆరో తరగతి డ్రాపౌట్ అయిన యువకుడితో అక్రమ సంబంధం, ఎవరీ షబ్నమ్ ?

Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 18, 2021 | 1:15 PM

Shabnam case: షబ్నమ్..ఇన్నేళ్లకు మళ్ళీ ఈ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎవరీమె ? తన కుటుంబంలో ఏడుగురు సభ్యులను తన ప్రియుడు సలీం సాయంతో దారుణంగా చంపిన ఈ హంతకి ఎందుకిలా తెగించింది ? యూపీలోని అమ్రోహీ మర్డర్ కేసులో ఉరిశిక్షకు గురైన తొలి భారతీయ మహిళ అయిన ఈమె గత చరిత్ర తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంగ్లీష్, జాగ్రఫీలో డబుల్ ఎంఏ చదివిన షబ్నమ్..ఆరో తరగతి చదువుతూ మధ్యలో మానేసిన సలీం అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన ఇంటి దగ్గరలోనే  కట్టెల రంపపు యూనిట్ లో పని చేసే సలీంని పెళ్లాడాలనుకుంది. కానీ వీరి పెళ్ళికి ఈమె కుటుంబంలోని ఇతర సభ్యులు అడ్డు చెప్పడంతో ఇద్దరూ కలిసి వారి హత్యకు పథకం పన్నారు. 2008 ఏప్రిల్ 14-15 రాత్రి షబ్నమ్ తన కుటుంబంలోని ఏడుగురి ప్రాణాలు తీసింది. చివరకు శిశువని కూడా చూడకుండా తనకు మేనల్లుడైన చిన్నారిని సైతం గొంతు నులిమి హతమార్చింది. ఏడుగురి హత్య జరిగిన 5 రోజుల అనంతరం 2008 ఏప్రిల్ 19 న షబ్నమ్, సలీంలను పోలీసులు అరెస్టు చేశారు.

2008 లో షబ్నమ్ ఓ శిశువుకు జన్మనిచ్చింది. షబ్నమ్, సలీం లను ఉరి తీయాలని 2010 జులై 14 న జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునివ్వగా దాన్ని వీరు అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. ఆ కోర్టు కూడా వీరి మరణ శిక్షను ధృవీకరించింది. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ వీరు సుప్రీంకోర్టుకెక్కారు. 2015 లో సుప్రీంకోర్టు అలహాబాద్ కోర్టు తీర్పును సమర్థించింది. వీరికి మరణశిక్షే తగినదని స్పష్టం చేసింది, దాంతో లీగల్ మార్గాలన్నీ మూసుకుపోగా.. షబ్నమ్ తనకు క్షమాభిక్ష పెట్టాలని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వేడుకుంది. కానీ ప్రణబ్ దాన్ని తిరస్కరించారు. చివరకు సుప్రీంకోర్టులో షబ్నమ్, సలీం రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.