Accident: సైకిల్ ను ఢీ కొట్టిన కారు.. వ్యక్తిని 8 కిలోమీటర్లు లాక్కెళ్లి.. చివరకు..

|

Jan 22, 2023 | 2:49 PM

దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యకు కొదవే లేకుండా పోతోంది. రోజురోజుకు పెరిగిపోతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే.. కొద్ది రోజులుగా హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసులు జరగుతుండటం...

Accident: సైకిల్ ను ఢీ కొట్టిన కారు.. వ్యక్తిని 8 కిలోమీటర్లు లాక్కెళ్లి.. చివరకు..
Car Dragged Man
Follow us on

దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యకు కొదవే లేకుండా పోతోంది. రోజురోజుకు పెరిగిపోతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే.. కొద్ది రోజులుగా హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసులు జరగుతుండటం కలకలం సృష్టిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటనను మరవకముందే.. బిహార్ లో అలాంటి ఘటనే జరిగింది. సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని కారు వేగంగా ఢీ కొట్టింది. దీంతో అతను కారు కింది భాగంలో చిక్కుకున్నాడు. అయినా కారు ఆపకుండా అలాగే 8 కిలోమీటర్లు లాక్కెళ్లి.. కారు వదిలి అక్కడి నుంచి పరారయ్యారు.

బిహార్ లోని మోతిహారి ప్రాంతానికి చెందిన శంకర్.. సైకిల్​పై వెళుతున్నాడు. ఆ సమయంలో గోపాల్​గంజ్​వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి వేగంగా దూసుకొచ్చింది. స్పీడ్ గా వచ్చి సైకిల్​ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో శంకర్.. కారు కింద ఇరుక్కున్నాడు. అయినా.. కారు ఆపకుండా అలాగే లాక్కెళ్లిపోయాడు డ్రైవర్. అలా శంకర్ ను 8 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో శంకర్ మృతి చెందాడు. కొత్వాలోని కదమ్ చౌక్ ప్రాంతానికి చేరుకున్న తర్వాత కారు డ్రైవర్, అందులో ఉన్న వారు కారును ఆపి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

వెంటనే అలర్ట్ అయిన స్థానికులు సమీపంలోని పోలీసులకు సమాచారం అందించారు. వారు జాతీయ రహదారి పక్కన ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి కారును స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్​సహాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..