Uttar Pradesh: బాలుడిపై పైశాచికం.. స్తంభానికి కట్టేసి మూడు గంటలు చిత్ర హింసలు.. నీళ్లు అడిగితే..

|

Oct 24, 2022 | 2:59 PM

ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలో దారుణం జరిగింది. సెల్ ఫోన్ దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ బాలుడిని స్తంభానికి కట్టేశారు. మూడు గంటలపాటు తీవ్రంగా కొట్టారు. దెబ్బలు తాళలేక బాలుడు నీళ్లు అడిగితే..

Uttar Pradesh: బాలుడిపై పైశాచికం.. స్తంభానికి కట్టేసి మూడు గంటలు చిత్ర హింసలు.. నీళ్లు అడిగితే..
Harassment
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలో దారుణం జరిగింది. సెల్ ఫోన్ దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ బాలుడిని స్తంభానికి కట్టేశారు. మూడు గంటలపాటు తీవ్రంగా కొట్టారు. దెబ్బలు తాళలేక బాలుడు నీళ్లు అడిగితే ఇవ్వకుండా నోట్లో కారం కొట్టారు. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చెవి, ముక్కు నుంచి రక్తస్రావమైంది. సమాచారం అందుకున్న అజంగఢ్ సిటీ ఎస్పీ శైలేంద్ర లాల్ మాట్లాడుతూ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు ఈ ఘటనపై ఎస్పీ అనురాగ్ ఆర్య ఇన్‌ఛార్జి ఇన్‌స్పెక్టర్‌ను మందలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అజంగఢ్ జిల్లాలోని బర్దా ప్రాంతంలోని హడిసా గ్రామంలో.. దొంగతనం నెపంతో ఓ అమాయక చిన్నారిని స్తంభానికి కట్టేశారు. అతను సెల్ ఫోన్ ను దొంగిలించినట్లు గ్రామస్థులు అనుమానించారు. ఈ ఘటనపై చిన్నారి తండ్రి రాంకేశ్‌ రామ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో 4 రోజుల క్రితం గ్రామానికి చెందిన రామ్ అసరే రామ్, సంజయ్ రామ్, సురేంద్ర రామ్, విజయ్ రామ్ తన కొడుకు మొబైల్ దొంగిలించాడని ఆరోపించారు.

చిన్నారిని చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు.. మూడు గంటల పాటు తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో బాధితుడు నీళ్లు అడిగితే ఇవ్వకుండా నోటిలో కారం పెట్టారు. అయితే అక్కడ నిలబడి ఉన్న జనం మాత్రం ఘటనను ఆపకుండా చూస్తు ఉండిపోవడం గమనార్హం. ఈ విషయమై నగర ఎస్పీ శైలేంద్రలాల్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ద్వారా పోలీసులకు విషయం తెలిసిందన్నారు. దీనిపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అంతే కాకుండా బాలుడిని కొడుతున్న సమయంలో ఆపకుండా నిలబడి ఉన్న గ్రామస్థులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..