జీవితంలో అతి ముఖ్యమైనది విజయం సాధించడం కాదు పోరాడటం. ఈ సూక్తిని బాగా వంటపట్టించుకున్నాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంబేడ్కర్ హసనురామ్. ఈయనకు కూడా గెలుపు అంత ఇంపార్టెంట్ కాదు.. పోరాడటమే ముఖ్యమాయనకు! అందుకే ఇన్నేసి సార్లు ఎన్నికల బరిలో దిగారు.. ఒకటా రెండా .. 92 సార్లు ఎన్నికల బరిలో దిగిన అంబేడ్కర్ ఒక్కటంటే ఒక్కసారి కూడా గెలువలలేకపోయారు. అయితేనేం తన ప్రయత్నాన్ని మాత్రం వీడలేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీకి సిద్ధమయ్యారు 74 ఏళ్ల పోరాటయోధుడు. పైపెచ్చు గెలవడం కోసం కాదనీ, ఓటమి కోసమే నామినేషన్ వేస్తున్నానని గర్వంగా చెప్పుకుంటున్నారు అంబేడ్కరి. ఆగ్రా జిల్లా ఖైరాగఢ్‌కు చెందిన అంబేడ్కర్ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజునే పుట్టారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీ పని చేస్తూ పొట్ట పోసుకుంటున్న ఆయనకు ఎన్నికల్లో పోటీ చేయడమంటే మహా సరదా!
1985 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేశారు.. ఇక ముందు కూడా చేస్తారు. మొదటిసారి బీఎస్పీ తరఫున పోటీ చేశారు. అప్పుడు గట్టిగానే ప్రయత్నించాను కానీ అదృష్టం కలిసి రాలేదని చెప్పుకొచ్చారాయన. అసెంబ్లీకి కూడా పోటీ చేద్దామనుకుంటే దగ్గరి వాళ్లే నిరుత్సాహపరిచారట! ‘నీ భార్యే మిమ్మల్ని సరిగ్గా గుర్తించదు.. ఇక నీకు ఓటు ఎవరేస్తారు’ అంటూ వెక్కిరించారట! ఆ ఎకసెక్కాలకు కాసింత నొచ్చుకున్నా పట్టువీడలేదా విక్రమార్కుడు.. 1988లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ నుంచి బయటకు వచ్చేసి ఖైరాగడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. పోటీ విషయంలో సెంచరీ కొట్టాలన్నది అంబేడ్కర్ టార్గెట్. ఇప్పటి వరకు 92 సార్లు పోటీ చేసిన ఆయన మరో ఏడుసార్లు పోటీ చేయాలనుకుంటున్నారు. అలా వందసార్లు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోవాలన్నది ఆయన ఆశయం. ఏదో రకంగా రికార్డు సాధించామన్న సంతృప్తి మిగిలి ఉంటుందని అంటున్నారు అంబేడ్కర్. డిపాజిట్ కోసం పెట్టే ఖర్చు తప్ప ఈయనగారు ఎన్నికల కోసం చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టరు. ఉత్సాహంతో ప్రచారం చేస్తారంతే! ఇంకో గమ్మత్తేమిటంటే ఈసారి ఆయన భార్య పోటీలో దిగుతున్నారు. అదీ ఆయనకు వ్యతిరేకంగా! అంబేడ్కరీ పోటీ చేస్తున్న వార్డు నుంచే ఆయన శ్రీమతి శివదేవి పోటీ చేస్తున్నారు. ఇంట్లో తగువులాడుకుంటారో లేదో కానీ ఎన్నికల బరిలో ఆలుమగలు కొట్టుకోవడాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఈ పోరులో ఎవరిది పైచేయి కానుందన్న ఆసక్తి కూడా స్థానికుల్లో ఉంది.
మరిన్ని చదవండి ఇక్కడ : షాకింగ్ ట్విస్ట్..చిన్నప్పుడు తప్పిపోయిన కూతురే కోడలైందా..? వైరల్ వీడియో: Shocking twist video.
అర్ధరాత్రి హైదరాబాద్ పార్టీ ఫాంహౌస్ లో అశ్లీల నృత్యాలు..లీకైన వీడియోలు..:AIMIM worker rave party at farmhouse Video.
ఆరుబయట అదరగొట్టిన ప్రి వెడ్డింగ్ షూట్ వైరల్ అవుతున్న ఫొటోస్ వీడియో..:Pre wedding shoot goes viral video.