కేరళలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు

భారీ వర్షాలకు కేరళ అతలాకుతలమవుతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదలు పెరగడంతో ఇడుక్కి డ్యామ్ గేట్లను ఎత్తారు. ఇడుక్కి, కోజికోడ్, వయనాడ్, మలప్పురం, కన్నూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఆయా జిల్లాల్లో 22 వరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు కోల్లాంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. కోజికోడ్ జిల్లాలో ఒక్కరోజే 150 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇడుక్కి, పథనంథిట్ల, కోట్టాయం జిల్లాల్లో రికార్డు స్థాయిలో […]

కేరళలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు

Edited By:

Updated on: Jul 21, 2019 | 9:27 AM

భారీ వర్షాలకు కేరళ అతలాకుతలమవుతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదలు పెరగడంతో ఇడుక్కి డ్యామ్ గేట్లను ఎత్తారు. ఇడుక్కి, కోజికోడ్, వయనాడ్, మలప్పురం, కన్నూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఆయా జిల్లాల్లో 22 వరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు కోల్లాంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. కోజికోడ్ జిల్లాలో ఒక్కరోజే 150 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇడుక్కి, పథనంథిట్ల, కోట్టాయం జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా పంబ ప్రాంతం జలమయమైంది. దీంతో శబరిమల అయ్యప్ప ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.