PM Modi: ప్రధాని మోదీ దృఢ సంకల్పం.. సాక్షాత్కారమైన 500 ఏళ్ల నాటి స్వప్నం..

|

Jan 22, 2024 | 1:55 PM

ఐదు శతబ్దాల కల సాకారం.. ఎక్కడైతే రాముడు జన్మించారో అక్కడే దివ్య భవ్య రామాలయం.. 5వందల ఏళ్ల సంకల్పం సాక్షాత్కారమైన శుభ సందర్భం.. అభిజత్‌ లగ్నంలో అయోధ్య గుర్భగుడిలో బాలరాముడు కొలువుదీరారు. ప్రధాని నరేంద్ర మోదీ 32 ఏళ్ల మహాయజ్ఞం దిగ్విజయంగా పరిపూర్ణమైన మహోతన్న సందర్భం ఇది..

PM Modi: ప్రధాని మోదీ దృఢ సంకల్పం.. సాక్షాత్కారమైన 500 ఏళ్ల నాటి స్వప్నం..
Pm Modi
Follow us on

ఐదు శతబ్దాల కల సాకారం.. ఎక్కడైతే రాముడు జన్మించారో అక్కడే దివ్య భవ్య రామాలయం.. 5వందల ఏళ్ల సంకల్పం సాక్షాత్కారమైన శుభ సందర్భం.. అభిజత్‌ లగ్నంలో అయోధ్య గుర్భగుడిలో బాలరాముడు కొలువుదీరారు. ప్రధాని నరేంద్ర మోదీ 32 ఏళ్ల మహాయజ్ఞం దిగ్విజయంగా పరిపూర్ణమైన మహోతన్న సందర్భం ఇది.. రాజకీయాల్లోకి రాకముందు నుంచే రామ భక్తుడిగా అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం సంకల్పం చేపట్టారు నరేంద్ర మోదీ. అద్వానీ రథయాత్రలో కీలక పాత్ర పోషించారు. 1992లోనే మోదీ ధృఢ సంకల్పం. సత్య నిష్టతో సత్య సంకల్పాన్ని సాకారం చేసుకున్నారు.

ఈ వేడుక కోసం నిష్టగా 11 రోజుల దీక్ష చేపట్టారు ప్రధాని మోదీ. రాముడు నడియాడిన క్షేత్రాలను సందర్శించారు. తమిళనాడులో రామసేతును దర్శించారు..సముద్ర స్నానం చేశారు. రామేశ్వరంలో.. శ్రీరంగంలో..ధనుష్కోటి కోదండరామాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 11 రోజుల దీక్షలో ప్రతినిత్య రామాయణాన్ని పఠించారు. నియమ నిష్టలో దీక్షను కొనసాగించిన ప్రధాని మోదీ.. మనసంతా భక్తితో రామవిహ్రా ప్రతిష్టాపనలో పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మోదీ ఉపవాస దీక్షను విరమించారు.

ప్రాణప్రతిష్ఠ షెడ్యూల్..

  • ఉదయం 10: 25 నిమిషాలకు అయోధ్యకు చేరుకున్నారు ప్రధాని మోదీ.. 10 గంటల 45 నిమిషాలకు అయోధ్య హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.. పది గంటల 55 నిమిషాలకు రామజన్మభూమి స్థలికి చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామమందిరంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు మోదీ..
  • ముహుర్తం ప్రకారం 12 గంటల ఐదు నిమిషాల నుంచి బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కు సంబంధించి వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
  • 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్లు ..అంటే 84 సెకన్ల దివ్య ముహుర్తంలో బాలరాముడి విగ్రహా ప్రాణప్రతిష్ట పరిపూర్ణమైంది..

ప్రధాని మోదీ బాలరాముడి విగ్రహానికి నేత్రావరణం చేశారు. విగ్రహానికి కట్టిన పసుపు వర్ణ వస్త్రాన్ని తొలిగించారు. బాలరాముడి తొలి దర్శనం ఆ రామయ్యదే. అద్దంలో రామయ్య ప్రతిబింబాన్ని రామయ్యకు దర్శింపచేశారు వేద పండితులు, నేత్రవరణం అనంతరం బాలరాముడి కళ్లకు కాటుకు పెట్టారు. ఈ వేడుక జరుగుతున్నంత సేపు కర్తగా గర్భగుడిలో వున్నారు ప్రదాని మోది. ఆయనతో పాటు యూపీ గవర్నర్‌ ఆనందీ బెన్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాలకు అభిక మహోత్సవంలో పాల్గొన్నారు. ఆతరువాత ఒంటి గంట నుంచి 2 గంటల వరకు సార్వజనిక్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. అయోధ్య వేదికగా తన సందేశాన్ని అందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..