50 ఏళ్ల వయసులో 14వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ! ఎక్కడో తెలుసా..?

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాకు చెందిన 50 ఏళ్ల గుడియా అనే మహిళ 14వ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు ఇప్పటికే తొమ్మిది మంది పిల్లలు ఉన్నారని, ముగ్గురు చనిపోయారని ఆమె తెలిపినప్పటికీ, ఆసుపత్రి అధికారులు ఇది ఆమెకు 14వ సంతానమని ధ్రువీకరించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

50 ఏళ్ల వయసులో 14వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ! ఎక్కడో తెలుసా..?
Up News

Updated on: Apr 03, 2025 | 4:18 PM

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాకు చెందిన 50 ఏళ్ల మహిళ 14వ బిడ్డకు జన్మినిచ్చింది. 14వ సంతానంగా ఆమెకు ఆడ శిశువు జన్మించింది. ప్రస్తుతం ఆమె పెద్ద బిడ్డకు 22 ఏళ్లు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. 50 ఏళ్ల వయసులో 14వ బిడ్డకు జన్మినిచ్చిన మహిళ పేరు గుడియా. ఆమె భర్త పేరు ఇమాముద్దీన్.. ఈ దంపతులకు 14వ సంతానంగా ఆడపిల్ల పుట్టడంపై ఎంతో సంతోషంగా ఉన్నారు. కాగా.. 9 నెలలు నిండకుండానే గుడియాకు నొప్పులు రావడంతో ఆమెను అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కానీ, ఆస్పత్రికి చేరుకునే లోపే గుడియాకు ప్రసవం జరిగిపోయింది. గుడియా తన నవజాత శిశువుతో, ఆమె పెద్ద బిడ్డ పక్కన కూర్చుని ఉన్న వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. అయితే గుడియా తనకు తొమ్మిది మంది పిల్లలు మాత్రమే ఉన్నారని పేర్కొంది. “నాకు 4 మంది అబ్బాయిలు, 5 మంది అమ్మాయిలు ఉన్నారు. ముగ్గురు చనిపోయారు. నాకు మొత్తం 9 మంది పిల్లలు ఉన్నారు” అని ఆమె స్థానిక మీడియాకు స్పష్టం చేసింది. “నాకు 14 మంది పిల్లలు ఉన్నారని ఎవరు చెప్పారు? అది అబద్ధం” అని ఆమె అన్నారు. కానీ ఆమె తన నవజాత శిశువును ప్రసవించిన ఆసుపత్రి అధికారులు అది ఆమెకు 14వ సంతానం అని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.