కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలింది. ఇటీవల మణిపూర్ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు బుధవారం నాడు కమలం గూటకి చేరుకున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కండువా కప్పుకుని.. పార్టీ సభ్యత్వాన్ని కూడా తీసుకున్నారు. వీరిలో మణిపూర్ సీఎల్పీ నాయకుడు ఓక్రామ్ ఇబోబి సింగ్ మేనల్లుడు ఓక్రామ్ హెన్రీ సింగ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటుగా.. ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ పాల్గొన్నారు.
Delhi: Five Manipur MLAs who joined BJP today after they had resigned from Congress, meet party’s national president Jagat Prakash Nadda. pic.twitter.com/t03uPYwGzR
— ANI (@ANI) August 19, 2020
Read More :