Cardiac Arrest: నీరుగారి పోతున్న లేత గుండెలు.. దిగ్గజ ఐటీ కంపెనీ వాష్‌రూంలో గుండె పోటుతో ‘టెకీ’ మృతి!

|

Sep 29, 2024 | 6:11 PM

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా అన్ని పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరూ గుండెపోటుతో కుప్పకూలుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు 60 దాటిన వారికి వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు అన్ని వయసుల వారినీ హడలెత్తిస్తు్న్నాయి. తాజాగా ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ టెకీ.. మూత్రవిసర్జనకు వాష్‌రూంకి వెళ్లాడు. అయితే గుండెపోటుతో హఠాత్తుగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి..

Cardiac Arrest: నీరుగారి పోతున్న లేత గుండెలు.. దిగ్గజ ఐటీ కంపెనీ వాష్‌రూంలో గుండె పోటుతో టెకీ మృతి!
Cardiac Arrest
Follow us on

నాగపూర్, సెప్టెంబర్ 29: ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా అన్ని పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరూ గుండెపోటుతో కుప్పకూలుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు 60 దాటిన వారికి వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు అన్ని వయసుల వారినీ హడలెత్తిస్తు్న్నాయి. తాజాగా ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ టెకీ.. మూత్రవిసర్జనకు వాష్‌రూంకి వెళ్లాడు. అయితే గుండెపోటుతో హఠాత్తుగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నాగపూర్‌లో చోటు చేసుకుంది. ఈ షాకింగ్‌ ఘటన శుక్రవారం చోటు చేసుకోంగా ఆదివారం (సెప్టెంబర్‌ 29) వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలోని ప్రముఖ దిగ్గజ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ.. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ సీనియర్  అనలిస్ట్ గా నితిన్ ఎడ్విన్ మైఖేల్‌ (40) గత కొన్నేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 7 గంటలకు కంపెనీ కార్యాలయంలోని వాష్‌రూమ్‌కి వెళ్లాడు. అయితే అతడు ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి ఉద్యోగులు ఆందోళన చెందారు. వెంటనే వాష్‌రూం తలుపు పగలగొట్టి చూడగా.. లోపల నేలపై పడిపోయి విగత జీవిగా కనిపించాడు. వెంటనే తోటి ఉద్యోగులు అతన్ని నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి తరలించారు. అయితే అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయినట్లు ధృవీకరించారు. దీనిపై సోనెగావ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించగా.. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మైఖేల్‌ మృతిని ప్రమాదవశాత్తు మృతిగా ప్రాథమికంగా నిర్ధారించి, ఆ మేరకు కేసు నమోదు చేశారు. ప్రాథమిక శవపరీక్ష ఫలితాల్లో మైఖేల్‌ గుండెపోటుతో మరణించినట్లు వెల్లడైంది. అతడి మృతికి సంబంధించిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా మృతుడు మైఖేల్‌కు భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు.

కాగా మంగళవారం (సెప్టెంబర్ 24) ఇదే మాదిరి లక్నోలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఓ మహిళా ఉద్యోగి పని ఒత్తిడి కారణంగా ఆఫీస్‌ చైర్‌లోనే గుండెపోటుతో మృతి చెందని సంగతి తెలిసిందే. మృతురాలిని సదాఫ్ ఫాతిమాగా గుర్తించారు. ఆమె గోమతి నగర్‌లోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విబూతి ఖండ్ బ్రాంచ్‌లో అదనపు డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె కూడా అధిక పని ఒత్తిడి, పనిభారం కారణంగా గుండెపోటుతో మరణించింది. తన కుమార్తె ఆందోళన, నిద్రలేమి, అధిక పనిభారం కారణంగా ఒత్తిడితో పడుతున్న కష్టాలను కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వివరించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.