Kochi University Stampede: కొచ్చి యూనివర్సిటీలో తొక్కిసలాట.. నలుగురి విద్యార్థుల మృతి.. 64 మందికి గాయాలు..

|

Nov 26, 2023 | 9:27 AM

Stampede in Kochi University: కొచ్చి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ యూనివర్సిటీ (CUSAT) వార్షికోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. వార్షికోత్సవంలో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్ధులు దుర్మరణం చెందారు. దాదాపు 64 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కొచ్చి యూనివర్సిటీ వార్షికోత్సవం సందర్భంగా యూనివర్సిటీ క్యాంపస్‌ ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌లో శనివారం రాత్రి ప్రముఖ గాయని నికితా గాంధీ మ్యూజికల్‌ షో ఏర్పాటు చేశారు.

Kochi University Stampede: కొచ్చి యూనివర్సిటీలో తొక్కిసలాట.. నలుగురి విద్యార్థుల మృతి.. 64 మందికి గాయాలు..
Kochi University Stampede
Follow us on

Stampede in Kochi University: కొచ్చి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ యూనివర్సిటీ (CUSAT) వార్షికోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. వార్షికోత్సవంలో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్ధులు దుర్మరణం చెందారు. దాదాపు 64 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కొచ్చి యూనివర్సిటీ వార్షికోత్సవం సందర్భంగా యూనివర్సిటీ క్యాంపస్‌ ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌లో శనివారం రాత్రి ప్రముఖ గాయని నికితా గాంధీ మ్యూజికల్‌ షో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీగా హాజరయ్యారు. హఠాత్తుగా వర్షం కురవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వర్షం నేపథ్యంలో బయట వేచి ఉన్న వారంతా ఒక్కసారిగా ఓపెన్-ఎయిర్ ఆడిటోరియంలో పరుగులు తీశారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది. చాలామంది విద్యార్థులు జారి కిందపడిపోయారు. ద

కొచ్చి యూనివర్సిటిలో తొక్కిసలాట ఘటనపై కోజికోడ్‌లోని ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం రాత్రి 8:30 గంటలకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధ్యక్షతన మంత్రుల అత్యవసర సమావేశం జరిగింది. ఈ దుర్ఘటనపై సీఎం పినరయ్‌ విజయన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రులందరూ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని సీపీఎం చేపట్టిన నవ కేరళ సదస్సులో భాగంగా ఆదివారం జరగాల్సిన అన్ని ఉత్సవ, కళాత్మక కార్యక్రమాలను రద్దు చేయాలని నిర్ణయించారు.

వీడియో చూడండి..

కనీసం 64 మంది విద్యార్థులు వివిధ ఆసుపత్రుల్లో గాయాలతో చికిత్స పొందుతున్నారు. కొచ్చిలోని కలమస్సేరి మెడికల్ కాలేజీలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు చనిపోయారని మంత్రి ఎమ్మెస్ జార్జ్ చెప్పారు. “వార్త చాలా దురదృష్టకరం. 46 మందిని గాయాలతో కలమస్సేరి మెడికల్ కాలేజీకి తీసుకువచ్చారు. నలుగురు మరణించారు, వారిలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ఇద్దరు ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నారు. మిగిలిన ఇద్దరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు” అని ఆరోగ్య మంత్రి తెలిపారు.

గాయపడిన 18 మందిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రులను అప్రమత్తం చేశామని.. అధికారుల బృందం ఆసుపత్రుల నుంచి సమాచారాన్ని సేకరిస్తోందన్నారు. కాగా.. గాయపడిన వారికి సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

అయితే, ఈ ఫెస్ట్ కు పాసులు ఉన్నవారికే ప్రవేశం ఉందని అధికారులు తెలిపారు. లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే గేటును ఉపయోగించడం తొక్కిసలాటకు కారణమైందని పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..