Delhi News: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఆటోరిక్షాపై బోల్తాపడిన కంటైనర్.. నలుగురు మృతి, పరారీలో డ్రైవర్

|

Dec 18, 2021 | 1:31 PM

Delhi News: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్ ఢిల్లీలోని ఐజీఐ స్టేడియం సమీపంలో కంటైనర్-ట్రక్కు ఒకదానికొకటి ఢీ కొట్టాయి. ఈ ఘటనలో కంటైనర్ ఆటోరిక్షాపై..

Delhi News:   ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఆటోరిక్షాపై బోల్తాపడిన కంటైనర్.. నలుగురు మృతి, పరారీలో డ్రైవర్
Container Truck
Follow us on

Delhi News: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్ ఢిల్లీలోని ఐజీఐ స్టేడియం సమీపంలో కంటైనర్-ట్రక్కు ఒకదానికొకటి ఢీ కొట్టాయి. ఈ ఘటనలో కంటైనర్ ఆటోరిక్షాపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలం వద్ద నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. ఆటోరిక్షా శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసి.. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుల్లో ఇద్దరిని గుర్తించామని.. ఒకరు శాస్త్రి పార్క్ దగ్గర నివాసం ఉండే సురేందర్ కుమార్ యాదవ్ సహా అతని మేనల్లుడు జై కిషోర్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన రెండు మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు.

ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కు డ్రైవర్ సహా మరొక వ్యక్తి.. సంఘటన స్థలం నుంచి పారిపోయారని.. నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. ఈ దారుణ ఘటన ఉదయం జరిగినట్లు తమకు సమాచారం అందిందని.. ఇందిరాగాంధీ స్టేడియంలోని గేట్-16 ముందు రింగ్ రోడ్డుపై పెద్ద ట్రక్కు బోల్తా పడిందని ఎవరో తమకు సమాచారం ఇచ్చారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతా చౌహాన్ తెలిపారు. అయితే ఆటోరిక్షా పై కంటైనర్ బోల్తాపడడంతో ఆటో తుక్కుతుక్కుగా అయిపొయింది. ఆటోలోని మృతదేహాలను వెలికి తీయడానికి సిబ్బంది చాలా కష్టపడరు. ఆటోరిక్షా అవశేషాలను కత్తిరించడానికి ప్రజలు సహకరించారని చెప్పారు. తమ విచారణలో ట్రక్కు బియ్యం లోడ్ తో ఉందని.. దీనిని ట్రాక్ యజమాని జితేందర్ సోనిపట్ నుండి తుగ్లకాబాద్ డిపోకు తీసుకుని వెళ్తున్నట్లు తేలిందని చెప్పారు. ఈ వాహనంలో 35 టన్నులకు బియ్యం ఉందని శ్వేతా చౌహాన్ చెప్పారు. నిందితుల కోసంగాలిస్తున్నామని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

Also Read:  ఇక నుంచి అక్కడ UG-PG బాలికలకు ప్రసూతి సెలవులు.. అది స్త్రీ హక్కు అంటూ అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్య