Noida Wall Collapse: నోయిడాలో విషాదం.. ప్రహారీ గోడ కూలి నలుగురు దుర్మరణం.. మరి కొంతమంది..

|

Sep 20, 2022 | 12:05 PM

ఉత్తరప్రదేశ్‌లో నోయిడాలో విషాదం చోటుచేసుకుంది. నోయిడా సెక్టార్-21లో గోడ కూలి నలుగురు చనిపోయారు. శిధిలాల కింద చిక్కుకున్న 12 మందిని రెస్క్యూ టీమ్‌ కాపాడారు.

Noida Wall Collapse: నోయిడాలో విషాదం.. ప్రహారీ గోడ కూలి నలుగురు దుర్మరణం.. మరి కొంతమంది..
Noida Wall Collapse
Follow us on

Noida Wall Collapse: ఉత్తరప్రదేశ్‌లో నోయిడాలో విషాదం చోటుచేసుకుంది. నోయిడా సెక్టార్-21లో గోడ కూలి నలుగురు చనిపోయారు. శిధిలాల కింద చిక్కుకున్న 12 మందిని రెస్క్యూ టీమ్‌ కాపాడారు. వారిలో 9 మంది మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద చాలామంది చిక్కుకుని ఉంటారని అధికారులు పేర్కొంటున్నారు. జల్‌వాయువిహార్‌ సొసైటీ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కూలిపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేటుసుకుంది.

ఈ ప్రాంతంలో డ్రైనేజీ మరమ్మతు పనులు చేస్తుండగా ప్రహరీ గోడ అకస్మాత్తుగా కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో పనులు చేస్తున్న నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. మరికొంత మంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

జల్‌వాయువిహార్‌ వద్ద డ్రైనేజ్‌ రిపేర్‌కి సంబంధించిన కాంట్రాక్ట్‌ పనులు ఇటీవలే మొదలయ్యాయి. దీంట్లో భాగంగా గోడ దగ్గర ఇటుకలు తీస్తుండగా అది ఒక్కసారిగా కూలిపోయింది.

రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని.. అన్ని బృందాలను మోహరించామని నోయిడా DM సుహాస్, కమిషనర్ అలోక్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

నోయిడా సెక్టార్ 21లో గోడ కూలిన ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి