NCB: వేల కిలోల మత్తు పదార్థాలు దగ్థం.. ఆన్‌లైన్‌లో వీక్షించిన కేంద్రమంత్రి.. ఎక్కడంటే?

|

Jul 30, 2022 | 8:51 PM

ఆగస్టు 15 నాటికి అది లక్ష కిలోలకు చేరుకుంటుందని తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజం.. సుసంపన్నమైన దేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి..

NCB: వేల కిలోల మత్తు పదార్థాలు దగ్థం.. ఆన్‌లైన్‌లో వీక్షించిన కేంద్రమంత్రి.. ఎక్కడంటే?
Drugs
Follow us on

NCB:  నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ఆధ్వర్యంలో శనివారం 30 వేల కిలోల డ్రగ్స్‌ను దగ్ధం చేశారు. వర్చువల్ విధానం ద్వారా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో ఎన్‌సీఐ అధికారులు దేశంలో నాలుగు ప్రధాన నగరాల్లో మత్తు పదార్థాలను దగ్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. చండీగఢ్‌ సదస్సుకు హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. డ్రగ్స్ దహన కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో వీక్షించారు. అనంతరం చండీగఢ్‌ నుంచి ఢిల్లీ, చెన్నై, గౌహతి, కోల్‌కతాలో జప్తు చేసిన డ్రగ్స్ ధ్వంసాన్ని డిజిటల్‌గా పర్యవేక్షించారు.

ఆజాదీ అమృత్ మహోత్సవ్‌ను జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు 75,000 కిలోల మాదక ద్రవ్యాలను నాశనం చేయాలని తీర్మానం చేశామని హోంమంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 82,000 కిలోల మాదకద్రవ్యాలను నాశనం చేశామని చెప్పారు. ఆగస్టు 15 నాటికి అది లక్ష కిలోలకు చేరుకుంటుందని తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజం.. సుసంపన్నమైన దేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. మాదకద్రవ్యాల వ్యాపారం ద్వారా సంపాదించిన మురికి డబ్బుతో దేశంలో వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడానికి ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తున్నామన్నారు. కాగా, ఎన్‌సీబీ జూన్ 1వ తేదీ నుంచి డ్రగ్స్ నిర్మూలన ప్రచారాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించింది. జూలై 29 నాటికి 11 రాష్ట్రాల్లో 51,217 కిలోల మత్తు పదార్థాలను కాల్చివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 30,468 కిలోలకు పైగా డ్రగ్స్‌ను దగ్ధం చేశామన్నారు. ఇందులో ఢిల్లీలో స్వాధీనం చేసుకున్న 19,320 కిలోలు, చెన్నైలో 1,309 కిలోలు, గువహటిలో 6,761 కిలోలు, కోల్‌కతాలో 3,077 కిలోలు ఉన్నాయని ఎన్‌సీబీ అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి