వ్యానుని దొంగిలించి.. డ్రైవింగ్ రాకా 10 కి.మీ తోసుకెళ్లారు.. చివరికి ఏం జరిగిందంటే

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ముగ్గరు దొంగలు కారుని దొంగలించి దాదాపు 10 కిలోమీటర్ల వరకు తోసుకుంటూ వెళ్లడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే మే 7 వ తేదిన.. సత్యం కుమార్, అమన్ గౌతమ్, అమిత్ వర్మ అనే ముగ్గురు కాలేజీ విద్యార్థులు ఓ వ్యాన్‌ను దొంగతనం చేశారు.

వ్యానుని దొంగిలించి.. డ్రైవింగ్ రాకా 10 కి.మీ తోసుకెళ్లారు.. చివరికి ఏం జరిగిందంటే
Van

Updated on: May 25, 2023 | 5:08 AM

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ముగ్గరు దొంగలు కారుని దొంగలించి దాదాపు 10 కిలోమీటర్ల వరకు తోసుకుంటూ వెళ్లడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే మే 7 వ తేదిన.. సత్యం కుమార్, అమన్ గౌతమ్, అమిత్ వర్మ అనే ముగ్గురు కాలేజీ విద్యార్థులు ఓ వ్యాన్‌ను దొంగతనం చేశారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఏంటంటే ఆ ముగ్గురిలో ఎవరికి కూడా డ్రైవింగ్ రాదు. చివరకి చేసేదేమి లేక దబౌలి నుంచి కళ్యాణ్‌పుర్ వరకు దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఆ వ్యాన్‌ను తోసుకుంటూ వెళ్లారు. అలాగే వారు ఆ వ్యానుకి నెంబర్ ప్లేట్ కూడా తొలగించారు. దాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాచేందుకు యత్నించారు. అలాగే ఆ కారును కూడా అమ్మేయాలని కుట్ర పన్నారు.

అయితే సమాచారం తెలుసున్న పోలీసులు నిందితులును అరెస్టు చేశారు. అమిత్ వర్మ అనే వ్యక్తి ఈ దొంగతనం ప్లాన్ వేశాడని తెలిపారు.అయితే ఈ ముగ్గురు కూడా వ్యాన్‌ను దొంగిలించిన ఓ వెబ్‌సైట్ జ్వారా అమ్మేయాలని అనుకున్నట్లు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న సత్యం కుమార్ ఓ వెబ్‌సైట్‌ను డిజైన్ చేశాడని.. అందులో నుంచి వారు ఆ వ్యానుని అమ్మేయాలని అనుకున్నట్లు తెలిపారు. అయినప్పటికీ తాము సమాచారం తెలుసుకొని వాళ్లని అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం