Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో వరుస భూకంపాలు.. దోడా, కత్రా ప్రాంతాల్లో మూడు సార్లు కంపించిన భూమి..

దీని ప్రభావంతో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. మరియు కనీసం ఐదుగురు గాయపడ్డారు. ప్రకంపనలు ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో కూడా కనిపించాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రజలు ఈ భూకంపం దాటికి భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో వరుస భూకంపాలు.. దోడా, కత్రా ప్రాంతాల్లో మూడు సార్లు కంపించిన భూమి..
Earthquake

Updated on: Jun 14, 2023 | 12:55 PM

దేశ రాజధాని పరిసర ప్రాంతాలు వరుస భూ ప్రకంపనలతో హడలెత్తిపోతున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని దోడా, కత్రా ప్రాంతాల్లో మూడు సార్లు భూకంపాలు సంభవించాయి. బుధవారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్‌లోని కత్రా, దోడా ప్రాంతాల్లో మూడుసార్లు భూకంపాలు సంభవించాయి. దీంతో ఇక్కడి నివాసితులలో భయాందోళనలు పెల్లుబికాయి. జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించిన ఒక రోజు తర్వాత తాజా ప్రకంపనలు సంభవించాయి. ఈ భూప్రకంపనల వల్ల అనేక భవనాలు దెబ్బతిన్నాయి. ఐదుగురు గాయపడ్డారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో మొదటి భూకంపం జూన్ 14 తెల్లవారుజామున 2.20 గంటలకు సంభవించింది. భూకంప కేంద్రం కత్రాకు 81 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఉంది.

రెండవ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 3.5గా నమోదైంది. ఉదయం 7.56 గంటలకు సంభవించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. మూడవ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 3.3గా నమోదైంది. ఇది ఈ రోజు ఉదయం 8.29 గంటలకు సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, మూడవ భూకంపం కేంద్రం కిష్త్వార్‌లో 5 కి.మీ లోతులో ఉందిని తెలిపింది.

ఇవి కూడా చదవండి

జమ్మూ కాశ్మీర్‌లో 5.4 తీవ్రతతో భూకంపం మంగళవారం, జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. మరియు కనీసం ఐదుగురు గాయపడ్డారు. ప్రకంపనలు ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో కూడా కనిపించాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రజలు ఈ భూకంపం దాటికి భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఈ ప్రాంతంలో మధ్యాహ్నం 1:33 గంటలకు 5.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. దీని కేంద్రం దోడాలో ఉంది. 6 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు తెలిపింది. దోడా జిల్లాలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..