Army Chopper Crash: న‌దిలో కుప్ప‌కూలిన ఆర్మీ హెలికాఫ్ట‌ర్.. విమానంలో ముగ్గురు పైలట్లు..

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆర్మీ ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ కూలిందని ఆర్మీ వర్గాలు ధ్రువీకరించాయి. ఆర్మీ హెలికాఫ్టర్ కూలిన ప్రదేశంలో ఇండియన్ ఆర్మీ, సహస్రబల్, పోలీసులు హుటాహుటిన వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి

Army Chopper Crash: న‌దిలో కుప్ప‌కూలిన ఆర్మీ హెలికాఫ్ట‌ర్.. విమానంలో ముగ్గురు పైలట్లు..
Army Chopper Crashes

Updated on: May 04, 2023 | 6:04 PM

జమ్మూకశ్మీర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌మాద‌వ‌శాత్తు ఓ ఆర్మీ హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాద స‌మ‌యంలో హెలికాప్ట‌ర్ లో ముగ్గురు ఉన్నారు. కాగా వారు గాయాల‌తో సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డార‌ని ఆర్మీ అధికారులు వెల్ల‌డించారు. కిష్టావర్ జిల్లాలోని మర్వా తహసీల్ పరిధి మచ్చన గ్రామంలో ఆర్మీ హెలికాఫ్టర్ ఒక్కసారిగా కూలిపోయింది. మార్వా ప్రాంతంలోని నదిలో హెలికాప్టర్‌ శకలాలు గుర్తించారు. విమానంలో ఉన్న ముగ్గురు పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆర్మీ ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ కూలిందని ఆర్మీ వర్గాలు ధ్రువీకరించాయి. ఆర్మీ హెలికాఫ్టర్ కూలిన ప్రదేశంలో ఇండియన్ ఆర్మీ, సహస్రబల్, పోలీసులు హుటాహుటిన వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..