IAS Tina Dabi: రెండో పెళ్లి చేసుకోనున్న ఐఏఎస్‌ ఆఫీసర్‌ టీనా దాబి! ఫుల్ లైఫ్ స్టోరీ ఇదే..

|

Mar 30, 2022 | 12:57 PM

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించి, సెకండ్‌ ర్యాంకర్‌ని ప్రేమ పెళ్లి చేసుకుని.. రెండేళ్లకే విడాకులు తీసుకున్న ఐఏఎస్‌ 2015 టాపర్‌ టీనా దాబి (Tina Dabi ) మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ విషయాన్ని..

IAS Tina Dabi: రెండో పెళ్లి చేసుకోనున్న ఐఏఎస్‌ ఆఫీసర్‌ టీనా దాబి! ఫుల్ లైఫ్ స్టోరీ ఇదే..
Tina Dabi Marriage Photos
Follow us on

2015 IAS Topper Tina Dabi Shocking Story In Telugu: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించి, సెకండ్‌ ర్యాంకర్‌ని ప్రేమ పెళ్లి చేసుకుని.. రెండేళ్లకే విడాకులు తీసుకున్న ఐఏఎస్‌ 2015 టాపర్‌ టీనా దాబి (Tina Dabi ) మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించిన ఆమె.. కాబోయే భర్త ఫొటోలు పంచుకున్నారు. తన కంటే రెండేళ్లు సీనియర్‌ అయిన 2013 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రదీప్‌ గవాండే (Pradeep Gawande)ను టీనా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. దాదాపు 1.4 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో సోషల్ మీడియాలోసైతం పాపులారిటీ పొందిన టీనా దాబి, ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచారు.

టీనా దాబి ఎవరంటే..
టీనా దాబి 1993 నవంబర్‌ 9న జశ్వంత్‌ దాబి, హిమాని దాబి దంపతులకు జన్మించారు. తండ్రి జశ్వంత్‌ దాబి బీఎస్ఎన్‌ఎల్‌లో జనరల్‌ మేనేజర్. తల్లి హిమాని దాబి మాజీ ఐఈఎస్‌ (ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీస్‌) ఆఫీసర్‌. వీరి సంతానమైన టీనా దాబి ఐసీఎస్ఈ 12 వ తరగతి బోర్డు పరీక్షల్లో పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ సబ్జెక్టు్‌ల్లో 100 శాతం మార్కులను సాధించారు. ఆ తర్వాత ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో బీఏ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తి చేశాక.. రావుస్‌ ఐఎస్‌ స్టడీ సర్కిల్‌లో సివిల్స్‌కు ప్రిపరేషన్ ప్రారంభించారు. ఫిక్స్‌డ్‌ టైం టేబుల్‌ ప్రకారం రోజుకు 9-12 గంటలపాటు ప్రిపేరయ్యేవారు. 22 ఏళ్ల వయస్సులో 2015లో మొదటి అటెంప్ట్‌లోనే కఠినమైన సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 2025 మార్కులకు గానూ 1063 మార్కులు సాధించింది. దీంతో దేశంలోనే యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్ పరీక్షల్లో మొదటి ర్యాంక్ సాధించిన మొట్టమొదటి దళిత మహిళగా అప్పట్లో దేశ వ్యాప్తంగా టీనా దాబి పేరు మారుమోగి పోయింది.

ప్రేమ పెళ్లి ఇలా..
అదే సంవత్సరం అధర్‌ రెండో ర్యాంకులో నిలిచారు. టీనా దాబీ, అథర్ అమీర్ ఖాన్ 2015లో ఢిల్లీలోని డీఓపీటీ కార్యాలయంలో జరిగిన ఐఎఎస్ సన్మాన కార్యక్రమంలో మొదటిసారిగా కలుసుకున్నారు. LBSNAA (లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్)లో శిక్షణ పొందుతున్న సమయంలో వీరిరువురూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2018, మార్చి 20న రాజస్థాన్‌లోని జైపూర్ కోర్టులో వివాహం చేసుకున్నారు. మతపరమైన వివాహ ఆచారాలు 2018, ఏప్రిల్7న కాశ్మీర్‌లోని పహల్గామ్ క్లబ్‌లో జరిగాయి. వీరిది మతాంతర వివాహం కావడంతో అప్పట్లో ఆ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ జంట పెళ్లికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అప్పటి కేంద్రమంత్రులు, లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అయితే, రెండేళ్లకే వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2021 చివరిలో విడాకులు తీసుకున్నారు. ఐతే లవ్‌ జిహాద్‌ ప్రభావం టీనాదాబీ కాపురంలో చిచ్చురేపిందా అనే అంశంలో సోహల్ మీడియాలో చర్చకూడా కొనసాగుతోంది. ఐతే మత పరమైన విభేదాలేవీ తనను ప్రభావితం చేయలేదని, తమ విడాకులు మతపర విభేదాలకు అతీతమైనవని శ్రీమతి దాబీ తెలియజేశారు.

టీనా రెండో పెళ్లి కథాకమామిషు..
తన కంటే రెండేళ్లు సీనియర్‌ అయిన 2013 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రదీప్‌ గవాండేను టీనా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. ఇటీవలే వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలను టీనా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం రాజస్థాన్‌ క్యాడర్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రదీప్‌ ప్రస్తుతం రాజస్థాన్‌లో పురాతత్వ, మ్యూజియం శాఖకు డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఐతే టీనా కంటే ప్రదీప్‌ 13 ఏళ్లు పెద్ద కావడం గమనార్హం. భారత ప్రభుత్వానికి క్యాబినెట్ సెక్రటరీగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్న టీనాకు ఇది సరి కొత్త ప్రారంభం అని చెప్పవచ్చు.

Also Read:

ISC Semester 2 exams 2022: 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు CISCE బోర్డు కీలక ప్రకటన! ఆ షరతులు మీరితే..