బ్రేకింగ్: ఫలించని ప్రార్థనలు.. బోరుబావిలో పడ్డ సుజీత్ మృతి

| Edited By:

Oct 29, 2019 | 7:47 AM

తమిళనాడు తిరుచ్చాపల్లి నడుకట్టుపట్టి గ్రామంలో బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి సుజీత్ విల్సన్‌ను మృతి చెందాడు. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం తెల్లవారుజామున వెల్లడించారు. బోరు బావి నుంచి కుళ్లిన వాసన వస్తుండటంతో.. చిన్నారి చనిపోయాడని గుర్తించిన ఫైర్ సిబ్బంది.. క్రేన్ ద్వారా మృతదేహాన్ని వెలికితీశారు. ఆ తరువాత చిన్నారి మృతదేహాన్ని మనప్పరాయ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బయటకు తీసుకువచ్చే సమయానికి బాడీ డీకంపోజింగ్ స్టేజీలో ఉండగా.. మృతదేహాన్ని చూసి చిన్నారి తల్లిదండ్రులు కన్నీటి సంద్రమవుతున్నారు. అయితే […]

బ్రేకింగ్: ఫలించని ప్రార్థనలు.. బోరుబావిలో పడ్డ సుజీత్ మృతి
Follow us on

తమిళనాడు తిరుచ్చాపల్లి నడుకట్టుపట్టి గ్రామంలో బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి సుజీత్ విల్సన్‌ను మృతి చెందాడు. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం తెల్లవారుజామున వెల్లడించారు. బోరు బావి నుంచి కుళ్లిన వాసన వస్తుండటంతో.. చిన్నారి చనిపోయాడని గుర్తించిన ఫైర్ సిబ్బంది.. క్రేన్ ద్వారా మృతదేహాన్ని వెలికితీశారు. ఆ తరువాత చిన్నారి మృతదేహాన్ని మనప్పరాయ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బయటకు తీసుకువచ్చే సమయానికి బాడీ డీకంపోజింగ్ స్టేజీలో ఉండగా.. మృతదేహాన్ని చూసి చిన్నారి తల్లిదండ్రులు కన్నీటి సంద్రమవుతున్నారు.

అయితే శుక్రవారం సాయంత్రం 5.30గంటల సమయంలో బోర్ బావి దగ్గరకు వెళ్లిన సుజీత్.. ప్రమాదవశాత్తు అందులో 35 అడుగుల లోతుకు పడిపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్.. అతడిని బయటకు తెచ్చేందుకు గత నాలుగు రోజులుగా ప్రయత్నాలు చేసింది. చిన్నారిని బయటకు తెచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా మరింత లోతుకు జారి.. ఏకంగా 90 అడుగల లోతుకు వెళ్లిపోయాడు. నాలుగు రోజులుగా ఆహారం, నీరు లేకుండా పోవడంతో.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన చిన్నారి.. అసవులు బాశాడు. అయితే సుజీత్ సురక్షితంగా బయటకు రావాలని దేశమంతా కోరుకుంది. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు ఈ ఘటనపై స్పందించారు. ఇక తమిళనాడుకు చెందిన ఆరోగ్య శాఖ మంత్రి, పర్యావరణ మంత్రి సహా పలువురు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇక సుజీత్ కోసం సేవ్ సుజీత్, ప్రే ఫర్ సుజీత్ పేరుతో నెటిజన్లు ట్వీట్లు చేశారు. అయితే ప్రార్థనలు ఫలించకపోగా.. ఆ బాలుడి మరణం అందరిలో శోకాన్ని నింపింది.