
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. చక్రతాలోని ‘టైగర్ వాటర్ ఫాల్స్ ‘ను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై భారీ చెట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఢిల్లీకి చెందిన ఒక పర్యాటకుడు సహా ఇద్దరు మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో కొండపై నుండి అకస్మాత్తుగా ఒక భారీ చెట్టు పడి జలపాతం కింద స్నానం చేస్తున్న వారిపై కూలింది. పడిపోయిన చెట్టు కింద ఇద్దరూ చిక్కుకోగా, కొమ్మలు పడిపోవడంతో మరో ముగ్గురు పర్యాటకులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. మృతులు చక్రతాలోని సుజౌ గ్రామానికి చెందిన స్థానికుడు గీతారామ్ జోషి (48), ఢిల్లీలోని షాహ్దారాకు చెందిన అల్కా ఆనంద్ (55)గా గుర్తించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక్కసారిగా భారీ చెట్టు కుప్పకూలటం చూసిన స్థానికులు, సందర్శకులు వెంటనే సహాయం కోసం పరుగెత్తారు. చెట్టు కింద చిక్కుకున్న వ్యక్తులను బయటకు తీసి అంబులెన్స్ ద్వారా చక్రతా సిహెచ్‌సికి తరలించారు. దురదృష్టవశాత్తు, ఇద్దరూ అక్కడికి చేరుకునేలోపే మరణించారని వైద్యులు ప్రకటించారు.
వీడియో ఇక్కడ చూడండి..
चकराता के पर्यटक स्थल टाइगर फॉल में पत्थर गिरने से दो लोगो की दर्दनाक मौत हो गई। टाइगर फॉल के पास एक पेड़ गिरने के कारण झरने में पत्थर गिरने लगे और नीचे नहा रहे दिल्ली निवासी दो पर्यटकों की मौत हो गई। #tigerfall #chakrata pic.twitter.com/NKUWkmlOPL
— Ajit Singh Rathi (@AjitSinghRathi) May 26, 2025
చక్రతా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ చంద్రశేఖర్ నౌటియల్ మాట్లాడుతూ.. శవపరీక్షల తర్వాత మృతదేహాలను కుటుంబాలకు అప్పగించినట్టుగా వివరించారు. గీతారామ్ జోషి సెలాకిలోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని, అతని భార్య, కుమార్తెతో కలిసి చక్రతాలోని టైగర్ వాటర్‌ఫాల్స్ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చినట్టుగా చెప్పారు. అల్కా ఆనంద్ తన కుమార్తె, కాబోయే భర్తతో కలిసి విహారయాత్రకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. మృతుడితో పాటు సమీపంలోని ముగ్గురు పర్యాటకులకు చెట్టు కొమ్మలు తగలటంతో స్వల్పంగా గాయాలు అయ్యాయని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..