రెండు గుడ్లు.. ఇంత ఖరీదా.. గుడ్లు తేలేయ్యాల్సిందే!

నటుడు రాహుల్ బోస్ చండీగఢ్‌లోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో రెండు అరటిపళ్ళు తింటే.. దానికి 442 రూపాయల బిల్లు ఇచ్చారు. దీనికి ఆ హోటల్‌పై ఎక్సైజ్- పన్నుల శాఖ రూ.25వేల జరిమానా విధించింది. అయితే ఇదే ఎక్కువని అనుకుంటే పొరపాటు.. ఎందుకంటే ఇలాంటి ఓ ఘటన తాజాగా ముంబై‌లో చోటు చేసుకుంది. ముంబై‌లోని ఫోర్ సీజన్ హోటల్‌లో రెండు ఉడికించిన గుడ్లకు ఏకంగా 1700 రూపాయల బిల్లు వేశారు. ఈ బిల్లును కార్తీక్ ధార్ అనే వ్యక్తి […]

రెండు గుడ్లు.. ఇంత ఖరీదా.. గుడ్లు తేలేయ్యాల్సిందే!

Updated on: Aug 11, 2019 | 8:05 PM

నటుడు రాహుల్ బోస్ చండీగఢ్‌లోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో రెండు అరటిపళ్ళు తింటే.. దానికి 442 రూపాయల బిల్లు ఇచ్చారు. దీనికి ఆ హోటల్‌పై ఎక్సైజ్- పన్నుల శాఖ రూ.25వేల జరిమానా విధించింది. అయితే ఇదే ఎక్కువని అనుకుంటే పొరపాటు.. ఎందుకంటే ఇలాంటి ఓ ఘటన తాజాగా ముంబై‌లో చోటు చేసుకుంది. ముంబై‌లోని ఫోర్ సీజన్ హోటల్‌లో రెండు ఉడికించిన గుడ్లకు ఏకంగా 1700 రూపాయల బిల్లు వేశారు.

ఈ బిల్లును కార్తీక్ ధార్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. అంతేకాదు అతడు నటుడు రాహుల్‌ను కూడా ట్యాగ్ చేసి వీటిపై ధర్నా చేద్దామా అని అడిగాడు.