Rahul Gandhi: వీడియో తీశాను.. కానీ..! కళ్యాన్ బెనర్జీ మిమిక్రీ వ్యవహారంపై స్పందించిన రాహుల్ గాంధీ..

పార్లమెంట్ నుంచి విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ వ్యవహారంపై రగడ మరింత ముదిరింది. తాజాగా మరో ఇద్దరు ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. దీంతో సస్పెన్షన్‌ వేటు పడిన ఎంపీల సంఖ్య 143కు చేరుకుంది. అయితే సస్పెన్షన్‌ను నిరసిస్తూ మంగళవారం పార్లమెంట్‌ ద్వారం దగ్గర విపక్ష ఎంపీలు తనపై మిమిక్రీ చేయడంపై మండిపడ్డారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌.

Rahul Gandhi: వీడియో తీశాను.. కానీ..! కళ్యాన్ బెనర్జీ మిమిక్రీ వ్యవహారంపై స్పందించిన రాహుల్ గాంధీ..
Rahul Gandhi

Updated on: Dec 20, 2023 | 9:34 PM

పార్లమెంట్ నుంచి విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ వ్యవహారంపై రగడ మరింత ముదిరింది. తాజాగా మరో ఇద్దరు ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. దీంతో సస్పెన్షన్‌ వేటు పడిన ఎంపీల సంఖ్య 143కు చేరుకుంది. అయితే సస్పెన్షన్‌ను నిరసిస్తూ మంగళవారం పార్లమెంట్‌ ద్వారం దగ్గర విపక్ష ఎంపీలు తనపై మిమిక్రీ చేయడంపై మండిపడ్డారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌. విపక్ష ఎంపీల తీరుతో తాను చాలా బాధపడినట్టు చెప్పారు. ఈ సందర్భంగా జగ్‌దీప్‌ ధన్‌కర్‌.. రాహుల్‌ గాంధీ, టీఎంసీ ఎంపీ కళ్యాణ్‌ బెనర్జీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అవమానిస్తే బాధ లేదని, కానీ జాట్లను, రైతు బిడ్డను అవమానిస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. జాట్‌ బిడ్డ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ను రాహుల్‌గాంధీ అవమానించారని జాట్‌ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడించాయి. కాంగ్రెస్‌ దిష్టిబొమ్మను ఆందోళనకారులు తగలబెట్టారు.

అయితే, ఈ వ్యవహారంపై రాహుల్‌గాంధీ వివరణ ఇచ్చారు. టీఎంసీ ఎంపీ కళ్యాణ్‌ బెనర్జీ ఆందోళన చేస్తునప్పుడు తాను షూట్‌ చేసిన వీడియో ఇప్పటికి కూడా ఫోన్‌లో ఉంందన్నారు. దానిపై అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. 143 మంది ఎంపీలపై సస్పెండ్‌ చేస్తే ఎవరు మాట్లాడడం లేదని, అదానీ రాఫెల్‌ వ్యవహారంపై సభలో ఎందుకు చర్చించడం లేదని రాహుల్‌ ప్రశ్నించారు. నిరుద్యోగం లాంటి అంశాల నుంచి దృష్టి మరల్చడానికే దీనిని తెరపైకి తెచ్చారని రాహుల్‌ కౌంటరిచ్చారు. ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా ఇండియా కూటమి నేతలు విజయ్‌ చౌక్‌ దగ్గర గురువారం ధర్నా చేయాలని నిర్ణయించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..