
Bihar News: బీహార్‌లో పిడుగులు తీవ్ర విషాదాన్ని నింపాయి. సోమవారం ఒక్క రోజే మూడు జిల్లాల్లో పిడుగులు పడి 11 మంది దుర్మరణం చెందారు. పూర్నియా జిల్లాలో నలుగురు, సుపాల్‌లో ముగ్గురు, అరారియాలో నలుగురు పిడుగుపాటుకు బలయ్యారు. పిడుగుపాటుకు మృతి చెందిన బాధిత కుటుంబాలకు బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు తలా రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ సాయాన్ని వారి కుటుంబాలకు తక్షణమే అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలని కోరారు. పిడుగులు పడకుండా ఉండేందుకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన సలహాలను ప్రజలు కచ్చితంగా పాటించాలని సలహా ఇచ్చారు. పిడుగులు పడే అవకాశమున్న ప్రాంతాల్లోని ప్రజలు.. తమ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సీఎం నితీశ్ కుమార్ సూచించారు.
మంగళవారంనాడు కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..