Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

పసందైన పుచ్చకాయండీ.. దీనికీ ఉంది ఓ స్పెషాలిటీ..

National Watermelons Day, పసందైన పుచ్చకాయండీ.. దీనికీ ఉంది ఓ స్పెషాలిటీ..

పుచ్చకాయలు వేసవి కాలంలో దాహాన్ని తీర్చడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఆరోగ్య సమస్యలకు దివ్యమైన ఔషదంలా పనిచేస్తాయి. అలాంటి వీటికంటూ ఒక స్పెషల్ డే ఉంది. ప్రతి సంవత్సరం ఆగష్టు 3న జాతీయ పుచ్చకాయ దినోత్సవంగా జరుపుకుంటారు. స్పెషల్ గా అమెరికాలో ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే ఈ స్పెషల్ డేని ఎవరు కనిపెట్టారో ఇప్పటికీ తెలియదు. కొందరు దీనిని పుచ్చకాయ రైతులు ప్రారంభించారని, మరికొందరు నేషనల్ వాటర్ మెలన్ కౌన్సిల్ సృష్టించినట్లు చెబుతారు. దక్షిణాఫ్రికాలో ఎక్కువగా ఈ పంటను పండించేవారు. దాదాపు వెయ్యి సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి పుచ్చకాయ పంట ఆసియా అంతటా వ్యాపించింది.

పుచ్చకాయలలో వ్యాధినిరోధక శక్తిని పెంచే బీటా కెరొటిన్, విటమిన్ బి, సి, లతో పాటు శరీర పనితీరుకు అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాసియం, అయోడిన్‌లు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు వీటి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పుచ్చకాయ గింజల్ని పొడి కొట్టి ఆ పొడిని నీటిలో మరిగించి చల్లారాక తాగితే కిడ్నీలో రాళ్లు మటుమాయం అవుతాయని అంటారు. ఇక పుచ్చకాయ అడుగున ఉండే తెల్లనైన పదార్ధం చర్మానికి చాలా మేలు చేస్తుంది. దాంతో చర్మాన్ని రుద్దితే చెమట వల్ల ఏర్పడే ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.