Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 22 వేల 771 మంది వైరస్​ సోకింది. మరో 442 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,35,433. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,94,227. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,655.
  • తెలంగాణలో ప్రజా ప్రతినిధులను వణికిస్తున్న కరోనా. ప్రగతి భవన్‌లో 30మందికిపైగా సిబ్బందికి కరోనా మరో 15రోజులపాటు ప్రగతి భవన్‌కు సీఎం దూరం. నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా- కోలుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు. యశోదలో చికత్స పొందుతున్న మహిళా ఎమ్మెల్యే. డిశ్చార్చి అయిన రాష్ట్ర హోంమంత్రి. హోం క్వారెంటైన్‌లోనే డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు. కరోనా వచ్చిన వెల్లడించని ఐదుగురికిపైగా ఎమ్మెల్యేలు. హోంక్వారైంట్‌న్‌లో చికిత్స.
  • నిమ్స్ డైరెక్టర్ మనోహర్. నిమ్స్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఐసీఎంఆర్ వాక్సిన్ ట్రయిల్ నిమ్స్ అసూపత్రిని ప్రకటించారు. 7వ తేదీ నుంచి క్లినిక్ ల ట్రయిల్ ప్రారంభిస్తాం. ఫేస్ 1,ఫేస్ 2 కిందా నిమ్స్ ఆసుపత్రిలో ఈ క్లినిక్ ల ట్రైల్స్ జరుగుతాయి. క్లినిక్ ల ట్రయిల్ భాగస్వామ్యం కావడం కోసం ముందుకు వస్తున్నారు,నిన్నటి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయ్. వాక్సిన్ తీసుకొనే వారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తాం. పరిశీలించిన తరవాత పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి వాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి ఫేస్ 28 రోజులు ఉంటుంది . వాక్సిన్ ఇచ్చిన తర్వాత 2 రోజులు ఆసుపత్రి అడ్మిట్ చేస్తాం ,ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తాం.
  • నల్లగొండ: రాంగోపాల్ వర్మ నిర్మించబోయే మర్డర్ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి బాలస్వామి. సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఆయన ఫిర్యాదు దాఖలు .దీనిపై స్పందించిన ఎస్సీ ఎస్టీ కోర్టు. రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులను ఆదేశించిన ఎస్సీ ఎస్టీ కోర్టు.
  • యాదాద్రి: ప్రభుత్వ విప్ గొంగిడి సునీత భర్త, నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేసిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్ధారించిన డాక్టర్లు. నిన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు, ఇద్దరు డ్రైవర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ.
  • విజయవాడ: వైసీపీ యం.పి రఘురామకృష్ణ రాజు కామెంట్స్. అమరావతి అనేది రాష్ట్రానికి మధ్యలో ఉండటమే కాకుండా మంచి రాజధాని. ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణచేయాలని భావించడం సమంజసం కాదు. అమరావతిలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండి ప్రభుత్వం అక్కడనుండే నడుస్తున్నతరుణంలో మూడు ముక్కలు చేయడం అనేది అన్యాయం. అమరావతి అనేది ఏకైక రాజదానిగా ఉండాలి.. న్యాయమైన డిమాండ్ కోసం పోరాటం చేయడం సమంజసం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం లో అమరావతి రైతలకు ఇచ్చిన హామీలను కొనసాగించాలి. ఇది పార్టీ నిర్ణయం కాదు ప్రభుత్వం నిర్ణయం. కరోనా తరువాత వచ్చే ఆర్థిక పరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆలోచనలు మేరకు నడవాలి.

తోకచుక్క నీటి లెక్క తేల్చిన నాసా శాస్త్రవేత్తలు.. వీడియో వైరల్

సాధారణంగా విశ్వంలోని ఎన్నో తోకచుక్కలు మన సౌర కుటుంబంలోకి వస్తూంటాయి.. వెళ్తూంటాయి. కానీ 2019వ సంవత్సరంలో వేరే నక్షత్ర మండల వ్యవస్థలోని 21/బొరిసావ్ అనే తోకచుక్క.. మన సౌర వ్యవస్థలోకి వచ్చింది. కానీ అది క్రమంగా సూర్యుడి దగ్గరగా వెళ్తూ..
NASA’s Swift Mission Tallied Water From Interstellar Comet Borisov, తోకచుక్క నీటి లెక్క తేల్చిన నాసా శాస్త్రవేత్తలు.. వీడియో వైరల్

సాధారణంగా విశ్వంలోని ఎన్నో తోకచుక్కలు మన సౌర కుటుంబంలోకి వస్తూంటాయి.. వెళ్తూంటాయి. కానీ 2019వ సంవత్సరంలో వేరే నక్షత్ర మండల వ్యవస్థలోని 21/బొరిసావ్ అనే తోకచుక్క.. మన సౌర వ్యవస్థలోకి వచ్చింది. కానీ అది క్రమంగా సూర్యుడి దగ్గరగా వెళ్తూ.. వెళ్తూ.. ఆ పక్క నుంచి అలా వెళ్లిపోయింది. అయితే అది ఎందుకు సూర్యుడి సైడ్‌ నుంచే వెళ్లిపోయిందని.. ఆ తోక చుక్కపై అమెరికాకు అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)కి చెందిన నెయిల్ గెహరెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ ట్రాక్ చేసింది. సాధారణ తోకచుక్కలకు ఈ బొరిసోవ్‌కి కొన్ని తేడాలున్నాయని తెలిపారు.

బొరిసోవ్ తోక చుక్క సూర్యుడి దగ్గరకు చేరే కొద్దీ ఎక్కువ నీటిని వదులుందని.. సూర్యుడికి దూరం అవుతున్న కొద్దీ తక్కువ నీటిని విడుదల చేస్తున్నది నాసా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇది ప్రతీ 10 సెకన్లకు ఓ బాత్ టబ్ నిండేంత నీటిని వదులుతుందంట. ఈ తోక చుక్క నీటితో పాటు దుమ్మునూ కూడా వదులుతుందని కనుగొన్నారు శాస్త్రవేత్తలు.

మూడేళ్ల కిందట ఔమువామువా అనే తోక చుక్క కూడా ఇలాగే వేరే సౌర వ్యవస్థ నుంచి మన సౌర కుటుంబంలోకి వచ్చి వెళ్లింది. ఇటీవలే 2019లో ఆగష్టు 30న బొరిసోవ్ సూర్యుడికి దగ్గరగా వచ్చింది. దీని వేగం గంటకు 161000 కిలోమీటర్లు. నిమిషానికి 2683 కిలోమీటర్లు. సెకండ్‌కి 44 కిలోమీటర్లు. అంటే ఉదాహరణకు ఇది ఈ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కేవలం 35 సెకండ్లలో వెళ్లగలదు. అలాగే ఈ తోకచుక్క సెకండ్‌కి 30 లీటర్ల నీరు విడుదల చేసింది. మన సౌరవ్యవస్థలోకి వచ్చి వెళ్లే లోపు ఇది 23 కోట్ల లీటర్ల నీటిని అంతరిక్షంలో వదిలింది. అంటే ఆ నీటితో మనం 92 ఒలింపక్ స్టేడియంలను నింపవచ్చన్నమాట.

Read More: 

మూడో విడత రేషన్ పంపిణీ.. ఈసారి బయోమెట్రిక్ తప్పనిసరి తాజా రూల్స్ ఇవే!

లైవ్‌లో ‘ఐలవ్‌యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

విజయ్‌తో ఆ రొమాంటిక్ సీన్స్ నాకు అవసరమా అనిపించింది

Related Tags