Breaking News
  • విశాఖ శారదాపీఠంలో విషజ్వర పీడా హర యాగానికి పూర్ణాహుతి. 11 రోజుల పాటు సాగిన అమృత పాశుపత సహిత యాగం. యాగాన్ని పర్యవేక్షించిన శారదా పీఠాధిపతులు.. స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర.
  • కరోనా వల్ల ఆక్వా రంగం ఇబ్బందుల్లో ఉంది. వాలంటీర్ల ద్వారా ప్రజల సమాచారం సేకరిస్తున్నాం. నిత్యావసరాల ధరలు పెరగకుండా చూస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూస్తున్నాం-మోపిదేవి.
  • ప్రజల రాకపోకలపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నాం-మంత్రి కన్నబాబు. కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించడం. ప్రజలకు సాయం అందించడం. ఫారెన్‌ రిటర్న్స్‌ను గుర్తించేందుకు ప్రత్యేక వ్యూహం-కన్నబాబు.
  • రాష్ట్రంలో పాల సరఫరాపై వివిధ డైరీలతో మంత్రి తలసాని సమీక్ష. డోర్‌డెలివరీ యాప్‌ల ద్వారా పాల సరఫరా. పాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు-మంత్రి తలసాని. పాల వాహనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు-తలసాని.
  • నిజామాబాద్‌లో కల్లు దొరకక ఇద్దరు మృతి. లాక్‌డౌన్‌ కారణంగా వారం రోజులుగా దొరకని కల్లు.
  • లాక్‌డౌన్‌తో చెన్నైలో విజయనగరం వాసుల అవస్థలు. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న కూలీలు. టీవీ9కు తమ గోడు చెప్పుకున్న కూలీలు.

Murder for insurance : జునాగఢ్‌లో జంట హత్యలు..లండన్‌లో స్కెచ్‌గీసిన దంపతులు

Murder for insurance : Murder of adopted son for insurance, Murder for insurance : జునాగఢ్‌లో జంట హత్యలు..లండన్‌లో స్కెచ్‌గీసిన దంపతులు

Murder for insurance :  గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లా… మాలియా హతీనా అనే చిన్న ఊరు… దగ్గరలోనే ఓ ప్రభుత్వ పాఠశాల… గోపాల్‌ అనే పదేళ్ల బాలుడు అందులో చదువుతున్నాడు. ఫిబ్రవరి 8, 2017. రాత్రి అటూఇటూగా తొమ్మిదిన్నర అవుతోంది.. పని మీద రాంచీకి వెళ్లిన గోపాల్ ఇంటికి తిరిగి వస్తున్నాడు.. దారిలో మోటార్‌సైకిళ్ల మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు గోపాల్‌ను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు.. గోపాల్‌తో పాటు పక్కనే ఉన్న అతని బావ కర్దానీ ఆ ఇద్దరితో పెనుగులాడాడు.. గుర్తు తెలియని వ్యక్తులు గోపాల్‌తో పాటు కర్దార్‌ను కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరిని రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు.. కర్దాని అక్కడికక్కడే చనిపోయాడు.. గోపాల్‌ హాస్పిటల్‌లో కన్నుమూశాడు..

డబ్బు కోసం గోపాల్‌ను చంపేశారనుకోడానికి లేదు.. ఎందుకంటే గోపాల్‌ పేరిట పూచిక పుల్లకూడా లేదు.. రెండేళ్లున్నప్పుడే తల్లి వదిలేసి వెళ్లిపోయింది.. బెంగతో తండ్రి అనారోగ్యంతో మంచం పట్టాడు.. దీంతో దగ్గరలో ఉన్న అక్క వరుసయ్యే ఆల్ఫా కర్దాని గోపాల్‌ను చేరదీసింది.. రెండే గదులున్న ఆ చిన్న ఇంట్లో గోపాల్‌తో పాటు తొమ్మిది మంది ఉండేవారు. వారి మధ్యన పెరిగాడు గోపాల్‌… జంట హత్యలను గుజరాత్‌ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.. గోపాల్‌ను చంపే అవసరం ఎవరికి ఉంటుందన్నది ఆరా తీశారు… ఒక్కో ఆధారమూ సేకరించుకుంటూ వెళ్లారు.. చివరికి హత్యకు మూలాలు లండన్‌లోని హాల్‌వెల్‌ నగరంలో ఉన్నట్టు తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారు.. అక్కడ నివసిస్తున్న 55 ఏళ్ల ఆర్తిధీర్‌, ఆమె భర్త 31 ఏళ్ల కవాల్‌ రాయ్‌జాడలను నిందితులుగా గుర్తించారు పోలీసులు..

ఆర్తి ధర్‌, కావల్‌ రాయ్‌జాడ 2013లో రిజిస్టర్‌ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు.. కొంతకాలం తర్వాత ఇండియాలోని మాలియా హతీనాకు వచ్చారు. తమకు పిల్లలు లేరంటూ గోపాల్‌ను దత్తతు తీసుకుంటామని ఆల్ఫా కర్దానికి నచ్చచెప్పారు.. అప్పటికప్పుడు ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు.. ఈ ఒప్పందానికి ఆ ప్రాంతంలోనే కోఆపరేటివ్‌ బ్యాంక్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న కావల్‌ తండ్రి ప్రత్యక్ష సాక్షి.. 2015, జులైలో ఆర్తిధర్‌, కావల్‌లకు గోపాల్‌ దత్తత పత్రాలు అందాయి… మొగుడు పెళ్లాలిద్దరూ కలిసి ముంబాయికి వచ్చి 2015, ఆగస్టు 26న గోపాల్‌ పేరిట వెల్త్‌ బిల్డిర్‌ అనే ప్రత్యేకమైన పాలసీ తీసుకున్నారు.. ప్రత్యేకం ఎందుకంటే దీనికి మామూలుకంటే పది రెట్ల ప్రీమియం కట్టాలి… లక్షా యాభై వేల పౌండ్ల పాలసీ… మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు కోటి నలభై లక్షల రూపాయలు.. వీసా వచ్చిన తర్వాత గోపాల్‌ను తమ వెంట తీసుకెళతామని చెప్పి ఆర్తిధర్‌, కావల్‌ రాయ్‌జాడ లండన్‌కు వెళ్లిపోయారు.. 2017లో మళ్లీ ఇండియాకు వచ్చి వీసా ప్రాసెస్‌ కోసం అంటూ రాంచీకి గోపాల్‌ను కారులో తీసుకెళ్లారు.. అక్కడ్నుంచి తిరిగి వస్తుండగా వారే కుట్రపన్ని చంపించారు.. ఆ రెండు హత్యలకు ఈ దంపతులే కారణమని వెస్ట్‌ లండన్‌ హైకోర్టు కూడా చెప్పింది..

కాకపోతే దోషులను తమకు అప్పగించాలంటూ భారత్‌ పెట్టుకున్న పిటిషన్‌ను మాత్రం కొట్టేసింది.. భారత్‌కు పంపితే వారికి ఎలాంటి పెరోల్‌ సదుపాయం లేకుండా యావజ్జీవ కారాగారశిక్ష విధించే అవకాశం ఉందని.. ఇది తమ పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తున్న చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుందని చెబుతూ అక్కడి హైకోర్టు పిటిషన్‌ను కొట్టేసింది.. ఇప్పుడు ఆ దోషులిద్దరూ హాయిగా తిరుగుతున్నారు.. జంట హత్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు… సరే.. గోపాల్‌ది హత్య అని తేలడంతో ఇన్సూరెన్స్‌ డబ్బులు కూడా వారికి అందలేదు.. హైకోర్టు నిర్ణయాన్ని పైకోర్టు సవాల్‌ చేయడానికి భారత పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు.. ఏనాటికైనా దోషులకు శిక్ష పడుతుందన్న నమ్మకం తనకుందంటున్నారు గోపాల్ అక్క అల్ఫా… చూద్దాం ఏమవుతుందో…!

 

ఇది కూడా చదవండి : మూవీ మేకర్స్‌కు షాక్..ఇకపై గోవాలో షూటింగ్ చేయాలంటే..

Related Tags