Breaking News
  • భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌.భారత్‌లో నిన్న 54,736 కరోనా కేసులు నమోదు, 853 మంది మృతి దేశవ్యాప్తంగా 17,50,724కు చేరిన పాజిటివ్‌ కేసులు.భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో 37,364 మంది మృతి.5,67,730 యాక్టివ్‌ కేసులు, ఇప్పటి వరకు 11,45,630 మంది డిశ్చార్జ్.
  • రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్ర శేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలలో సమర్దవంతమైన, కచ్చితమైన సేవలు అందించడానికి e-ఆఫీసును ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ తెలిపారు. సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సెక్రటేరియట్ లోని 8 శాఖలలో, HoD లలో 2 శాఖలలో e-ఆఫీసును ప్రారంభించారు.
  • హైదరాబాద్ లో పెరిగిన ఫోర్ వీలర్లఅమ్మాకాలు . మేనెలతో పోల్చితే రెండు నుంచి మూడింతలు పెరిగిన సేల్స్. సేల్స్ పెరగడంతో రిజిస్ట్రేషన్లు పెరిగాయంటున్న హైదరాబాద్ ఆర్టీఏ అధికారులు . మే నెలలో 326 ఫోర్ వీలర్ల రిజిస్ట్రేషన్లు. జూన్ లో 848 , జూలై లో 1149 రిజిస్ట్రేషన్లు . ఆర్ టి ఎ హైదరాబాద్ జాయింట్ కమిషనర్ పాండు రంగా నాయక్.
  • హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్. హైదరాబాద్ పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ ల మేళా ను సాలార్ జుంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసము. పాతబస్తీ లో సత్ప్రవ్తన కలిగి నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్ పై పోలీస్ రికార్డుల్లో నుంచి రౌడీ షీట్ తొలగించము. వీరంతా కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అవకాశం కలిపించం. గతంలో వీరంతా తప్పులు చేసి, నేరాలు చేసి జైల్ వెళ్లిన వారు. కానీ ఇప్పుడు ఒక సదవకాశం వీరు అందరికీ ఆదర్శంగా ఉండి కుటుంబం తో సంతోషంగా జీవించాలని సాధారణ పౌరులుగా వుండాలని కోరుతున్న.
  • విజయవాడ: కోవిడ్‌ ఆస్పత్రి సిబ్బంది చేతివాటం. రోగుల మొబైల్స్, డబ్బులు మాయం. సెల్‌ చోరీ చేస్తున్న దృశ్యాలు. సీసీ కెమెరాల్లో రికార్డు. ఒక రోగి అదృశ్యంపై అధికారులు సీసీ కెమెరాలు పరిశీలన. ఓ ఉద్యోగి రోగి సెల్‌ఫోన్‌ తస్కరించడం చూసి అధికారులు షాక్. ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు. ఉద్యోగి పై ఎవరు అనే కోణంలో దర్యాప్తు. సిబ్బంది ప్రవర్తనపై అధికారులు ఆరా.
  • బ్లాక్ బస్టర్ ఆగస్టుకు ఆహా OTT రెడి. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆహా OTT ఆగస్టులో 10 సినిమా లను అందిస్తుంది. పాపులర్ యాంకర్ సుమ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తదితరులు ఫేసుబుక్ లైవ్ ద్వారా పలు విషయాలు ప్రకటించారు. మొదట దిల్ రాజు బుచ్చినాయుడు కండ్రిగ సినిమాని ప్రకటించారు. ఆగస్ట్ 21న ఆహాలో విడుదల. తెనుగు వినోదాన్ని అందిస్తున్న ఆహా OTT లో ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా చూడవచ్చు. పాపులర్ కమెడియన్ హర్ష సరికొత్త రియాలిటీ షో ప్రకటించారు. తమాషా విత్ హర్ష అనే సరికొత్త షో ఈనెల 22నుండి మొదలు. చివరగా సుమ OTT లో తొలిసారి అడుగు పెడుతున్నట్లు ప్రకటించారు. సమకాలీన అంశాలతో అల్ ఈజ్ వెల్ అనే వెరైటీ షో ని ప్రకటించారు. ఆగస్ట్ 14 నుండి సుమ ఆల్ ఈజ్ వెల్ ప్రసారం అవుతుంది.

Film Making In GOA: మూవీ మేకర్స్‌కు షాక్..ఇకపై గోవాలో షూటింగ్ చేయాలంటే..

Film Making In GOA Film scripts to be vetted before granting shoot permit: Goa CM, Film Making In GOA: మూవీ మేకర్స్‌కు షాక్..ఇకపై గోవాలో షూటింగ్ చేయాలంటే..

Film Making In GOA :ఇకపై గోవాలో ఫిల్మ్ షూటింగ్‌కి నిబంధనలు కఠినతరం కానున్నాయి. రాష్ట్ర ఇమేజ్‌కు హాని చేయని సినిమాలకు మాత్రమే పర్మిషన్స్ ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు.  స్క్రిప్ట్‌లను మొదట ఒక కమిటీకి చూపించాల్సి ఉంటుందని, షూటింగ్‌కు అనుమతి ఇవ్వడానికి ముందే పరిశీలించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మోహిత్ సూరి చిత్రం మలంగ్‌లో గోవాను డ్రగ్స్ కేంద్రంగా ప్రొజెక్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

“ఇకపై, సినిమా షూటింగ్‌లకు  అనుమతి ఇచ్చేటప్పుడు ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా కథను తనిఖీ చేస్తుంది.  వారు క్షుణ్ణంగా పరిశీలనలు జరిపి గోవా ఇమేజ్‌ను అపహాస్యం చేయడం లేదని భావించినప్పుడే అనుమతి ఇస్తాము ”అని పేర్కొన్నారు. ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా అనేది నోడల్ ఏజెన్సీ. రాష్ట్రవ్యాప్తంగా జరిగే షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వడంతో పాటు వివిధ ఇతర రాష్ట్ర సంస్థలతో  సమన్వయం చేయడం దాని బాధ్యత. 

ఇది కూడా చదవండి : ఇండియన్ ఉసేన్ బోల్ట్‌కు ఊహించని ఆఫర్…

Related Tags