వావ్‌ వానర ప్రేమ!

Monkey tries feeding banana to kitten, వావ్‌ వానర ప్రేమ!

కోతికి ఒక ఇళ్లంటూ ఉండదు.. ఎవరి ఇంటినీ సరిగ్గా ఉండనివ్వదట.. కోతి చేష్టలు ఇలాగే ఉంటాయని అందరు విసుక్కుంటారు.. కానీ థాయిలాండ్‌లో ఓ కోతి చేష్ట అందరినీ ఆకర్షిస్తోంది.. ఓ పిల్లి పిల్లను సాకుతూ అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. తన చేతిలోని అరటిపండును తినిపించేందుకు తెగ ప్రయత్నిస్తోంది. కానీ పిల్ల పిల్లి మాత్రం తినడం లేదు. పాపం కోతికి తెలియదు కదా పిల్లి అరటి పండు తినదని.. ఈ కోతి వాలకం చూస్తుంటే పిల్లి పిల్లను ఎక్కడి నుంచో లేపుకొచ్చేసినట్లే అనిపిస్తోంది.. స్థానిక వ్యక్తి ఒకరు ఈ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఇది కాస్తా తెగ వైరలైపోయింది. తెగ కామెంట్లు, లైకులు కురుస్తున్నాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *