Reliance: ఫారాడియన్ లిమిటెడ్‌తో రిలయన్స్ ఒప్పందం.. బ్యాటరీ సాంకేతికతలో ఆర్ఐఎల్ ముందంజ..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ GBP 100 ఎంటర్‌ప్రైజ్ ఫారాడియన్ లిమిటెడ్ ("ఫారడియన్")లో 100% వాటాను తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంది...
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ GBP 100 ఎంటర్‌ప్రైజ్ ఫారాడియన్ లిమిటెడ్ (“ఫారడియన్”)లో 100% వాటాను తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. పేటెంట్ పొందిన సోడియం-అయాన్ బ్యాటరీ సాంకేతికతతో ఫారాడియన్ ప్రముఖ గ్లోబల్ బ్యాటరీ టెక్నాలజీ కంపెనీలలో ఒకటిగా ఉంది. కొనుగోలు గురించి మాట్లాడుతూ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, “ఫారాడియన్ దాని అనుభవజ్ఞులైన బృందానికి రిలయన్స్ కుటుంబం స్వాగతం పలుకుతుందన్నారు. ఇది అత్యంత అధునాతనమైన, సమగ్రమైన న్యూ ఎనర్జీ ఎకోసిస్టమ్ ఏర్పాటు, బ్యాటరీ సాంకేతికతలో ముందంజలో ఉంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం.
ఫారాడియన్ అభివృద్ధి చేసిన సోడియం-అయాన్ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇది మొబిలిటీ నుండి గ్రిడ్ స్కేల్ స్టోరేజ్, బ్యాకప్ పవర్‌ను కలిగి ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న EV ఛార్జింగ్ మార్కెట్ కోసం ఇంధన నిల్వ అవసరాలను సురక్షితం చేస్తుందన్నారు. మేము ఫారాడియన్ మేనేజ్‌మెంట్‌తో కలిసి పని చేస్తాం. భారతదేశం EV మొబిలిటీ, రవాణా రంగాన్ని అభివృద్ధి చేయడం అవసరమని చెప్పారు.
“సోడియం-అయాన్ బ్యాటరీ సాంకేతికతను సాధించిన మొదటి వాటిలో ఫెరాడియన్ ఒకటి అని ఫారాడియన్ CEO అయిన Mr. జేమ్స్ క్విన్ అన్నారు. వేగంగా విస్తరిస్తున్న భారతీయ మార్కెట్‌లో ఫారాడియన్ వృద్ధికి మద్దతు ఇవ్వడానికి రిలయన్స్ సరైన భాగస్వామి అని చెప్పారు.
Read Also.. Petrol Diesel Price: 2021లో మంట పుట్టించిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మరి న్యూ ఇయర్‌లో ఎలా ఉండబోతున్నాయి..!