Bank Rules: కస్టమర్లకు షాకివ్వనున్న 3 ప్రభుత్వ బ్యాంకులు.. ఫిబ్రవరి 1 నుంచి ఆ సేవల్లో మార్పులు.. అవేంటంటే?

|

Jan 26, 2022 | 12:54 PM

SBI-PNB-BOB: మారిన నిబంధనలకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో ఈ బ్యాంకుల కస్టమర్లు భారీగా నష్టపోవాల్సి రావచ్చు. అందుకే ఫిబ్రవరి 1 నుంచి మారే ఈ రూల్స్‌ను తెలుసుకోవడం ముఖ్యం.

Bank Rules: కస్టమర్లకు షాకివ్వనున్న 3 ప్రభుత్వ బ్యాంకులు.. ఫిబ్రవరి 1 నుంచి ఆ సేవల్లో మార్పులు.. అవేంటంటే?
New Rules In Sbi, Pnb And Bob
Follow us on

Bank Rules: బ్యాంకులు ఎప్పటికప్పుడు తమ నియమాలలో మార్పులు చేస్తూనే ఉంటున్నాయి. కానీ, చాలా మంది కస్టమర్‌లు సరైన సమయంలో మార్పుల గురించి తెలుసుకోలేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) కస్టమర్లా.. అయితే మీ కోసం చాలా కీలకమైన సమాచారం తీసుకొచ్చాం. ఈ మూడు బ్యాంకులు కొన్ని నిబంధనలను మార్చబోతున్నాయి. ఈ నియమాలు 1 ఫిబ్రవరి 2022 నుంచి ఖాతాదారులందరికీ వర్తించనున్నాయి. ఈ నిబంధనలను మార్చడంపై ఈ బ్యాంకులు తమ ఖాతాదారులకు అనేకసార్లు తెలియజేసినప్పటికీ, ఈ మార్పుల గురించి తెలియని వారు ఇంకా చాలా మందే ఉంటారు. మారనున్న ఆ నిబంధనలేంటో ఇప్పుడు చూద్దాం..

బీవోబీ చెక్ క్లియరెన్స్ నిబంధనల్లో మార్పులు..
బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిబ్రవరి 1 నుంచి చెక్ క్లియరెన్స్‌కు సంబంధించిన నిబంధనలను మార్చబోతోంది. ఫిబ్రవరి 1 నుంచి చెక్ చెల్లింపు కోసం, వినియోగదారులు సానుకూల చెల్లింపు విధానాన్ని అనుసరించాలి. అంటే ప్రస్తుతం ఖాతాదారులకు చెక్కును జారీ చేసిన తర్వాత, ఆ చెక్కుకు సంబంధించిన సమాచారాన్ని బ్యాంకుకు పంపవలసి ఉంటుంది. లేకపోతే, మీ చెక్కు క్లియర్ అవ్వదు. ఖాతాదారుల భద్రత దృష్ట్యా బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. మీరు చెక్ గురించి మెసేజ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ATM ద్వారా కూడా బ్యాంక్‌కి తెలియజేయవచ్చు. ఈ మార్పు కేవలం రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న చెక్కుల కోసం ఇలాంటి రూల్స్ మార్చింది. మీరు ఈ మొత్తానికి తక్కువ మొత్తంలో చెక్కును జారీ చేస్తే మాత్రం ఈ మార్పులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

ఆసేవలపై షాకింగ్ ఇవ్వనున్న పీఎన్‌బీ
చేస్తుంది. పీఎన్‌బీ చేయబోయే ఈ మార్పులు కస్టమర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పీఎన్‌బీ మార్చిన ఈ నిబంధనల ప్రకారం, మీ ఖాతాలో డబ్బు లేకపోవడం వల్ల మీ ఇన్‌స్టాల్‌మెంట్ లేదా ఈఎంఐ విఫలమైతే, మీరు భారీ నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. దీని కోసం, మీకు రూ. 250 జరిమానా విధించచనున్నారు. దీని కోసం ఇప్పటి వరకు రూ.100 వసూలు చేసేవారు. ఇది కాకుండా, మీరు డిమాండ్ డ్రాఫ్ట్‌ను రద్దు చేసినందుకు రూ.100 బదులుగా రూ.150 జరిమానా చెల్లించాలి. ఈ నిబంధనలన్నీ ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఎస్‌బీఐలో ప్రియం కానున్న ఆ సేవలు..
మీరు SBI కస్టమర్ అయితే, డబ్బు బదిలీ చేయడం మీకు మరింత ఖరీదైనదిగా మారనుంది. SBI వెబ్‌సైట్ ప్రకారం, ఫిబ్రవరి 1 నుంచి IMPS లావాదేవీలలో బ్యాంక్ కొత్త స్లాబ్‌ను జోడించనుంది. ఇది రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఉంటుంది. IMPS ద్వారా బ్యాంకు నుంచి రూ. 2 నుంచి రూ. 5 లక్షల వరకు డబ్బు పంపినందుకు కస్టమర్లు ప్రస్తుతం రూ. 20తోపాటు GST చెల్లించాలి.

Also Read: Lemongrass: తక్కువ పెట్టుబడితో ఎక్కువ బెనిఫిట్‌.. లెమన్‌ గ్రాస్‌ సాగుతో మంచి లాభాలు.. రూ.4 లక్షల సంపాదన..!

RBI: ఈ బ్యాంకుల్లో మీకు ఖాతా ఉందా…? 8 సహకార బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా.. భారీగా జరిమానా..!