Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

చంద్రబాబునాయుడు కాలనీలో.. వీడు చేసిన పనికి..!

సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి.. రోజుకో క్రైం స్టోరీ చూడాల్సి వస్తోంది. కొందరు సైబర్ క్రైం చేస్తే.. మరికొందరు.. దానిని దుర్వినియోగం చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. అంతేకాదు.. అరచేతిలో ఉండే ఈ ఫోన్‌లో నీలిచిత్రాలను చూస్తూ.. మానవ మృగాళ్లుగా మారుతున్నారు. గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. తెనాలిలోని చంద్రబాబునాయుడు కాలనీలో పసుపులేటి దుర్గాప్రసాద్‌ అనే ఓ వ్యక్తి మనిషి అన్న విషయం మరిచిపోయి.. ఓ పదేళ్ల బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. చూడకూడని చిత్రాలను, దృశ్యాలను ఆ బాలికకు చూపాడు. దుర్గాప్రసాద్‌కు 16 ఏళ్ల క్రితం వివాహమైనా పిల్లలు కలగలేదు. దీనికి తోడుగా వేధింపుల కారణంగా భార్య కూడా అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే స్థానికంగా వెదురు బొంగుల నిచ్చెనలు తయారు చేసి, విక్రయించడంతో పాటు.. స్థానికంగా కొద్ది మొత్తాల్లో అప్పులు కూడా ఇస్తూ ఉంటాడు. అయితే ఇతనికి సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు చూడడం వ్యసనంగా మారింది. అయితే ఆ వ్యసనంతో అతడు ఓ సైకోలా మారిపోయాడు. ఇంటి సమీపంలోని బాలికలను పిలిచి ఫోన్‌లో వారికి ఆ చిత్రాలను చూపించసాగాడు. గతంలో అదే ప్రాంతంలోని ఓ బాలికతో ఈ విధంగానే ప్రవర్తించగా, స్థానికులు దేహశుద్ధి చేశారు. తాజాగా శనివారం ఇంటి వద్ద ఆడుకుంటున్న పదేళ్ల బాలికను పిలిచి సెల్‌ఫోన్‌లో చిత్రాలు చూపించాడు. చిన్నారి భయపడి, రోదిస్తూ ఇంటికి వెళ్లి తల్లికి చెప్పుకుంది. ఆమె వచ్చి స్థానికులతో కలిసి దుర్గాప్రసాద్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.