కరోనా వ్యాక్సిన్ ధరలపై గందరగోళం.. తమ ధరను ప్రకటించిన మోడెర్నా సంస్థ.. ఎంతంటే.?

మోడెర్నా సంస్థ తమ కోవిడ్ వ్యాక్సిన్ ధరను ఖరారు చేసింది. ఒక్కో డోసుకు 25 డాలర్ల నుంచి 37 డాలర్ల మధ్య వసూలు చేసే అవకాశం…

  • Ravi Kiran
  • Publish Date - 10:17 am, Sun, 22 November 20

Moderna Covid Vaccine: మోడెర్నా సంస్థ తమ కోవిడ్ వ్యాక్సిన్ ధరను ఖరారు చేసింది. ఒక్కో డోసుకు 25 డాలర్ల నుంచి 37 డాలర్ల మధ్య వసూలు చేసే అవకాశం ఉందని ఆ సంస్థ సీఈవో స్టీఫేన్ బన్సెల్ ప్రకటించారు. సాధారణ ఫ్లూకి ఇచ్చే వ్యాక్సిన్ డోస్ మాదిరిగానే 10 డాలర్ల నుంచి 50 డాలర్ల పరిధిలోనే కరోనా టీకా ధర ఉంటుందని ఆయన తాజాగా జర్మన్ వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇప్పటికే పలు దేశాలు మోడెర్నా టీకాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత సోమవారం ఐరోపా సమాఖ్యతో చర్చలు కూడా జరిగాయి. వారు సుమారు మిలియన్ మోతాదు డోసులను 25 డాలర్ల కంటే తక్కువ ధర వసూలు చేస్తే కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చినట్లు బన్సెల్ తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఏదీ ఖరారు కాలేదని.. త్వరలోనే తాము ఐరోపా కమిషన్‌తో డీల్ కుదుర్చుకుంటామని ఆయన అన్నారు. ప్రస్తుతం చివరి దశ క్లినికల్ ట్రయిల్స్‌లో మోడెర్నా కోవిడ్ వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సుమారు 94.5 శాతం సమర్ధతను తమ వ్యాక్సిన్ చేరుకుందని మోడెర్నా తెలిపింది.

Also Read:

మాస్క్ లేకుంటే రూ. 2 వేలు భారీ జరిమానా.. నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్…

రోజుకు గరిష్టంగా 12 గంటలు.. వారానికి 48 గంటలు.. కార్మిక శాఖ కొత్త ప్రతిపాదన..

ఆరేళ్లుగా వీడని మిస్టరీ కేసు.. నిందితులను పట్టిస్తే రూ. 5 లక్షల డాలర్ల రివార్డు.!

వచ్చే ఐపీఎల్‌కు చెన్నై జట్టు భారీ మార్పులు.. ఆ ఐదుగురిపై వేటు తప్పదు.. లిస్టులో ధోని.!