పెళ్లి కోసం 850కి.మీ సైకిల్ తొక్కాడు..చివ‌ర‌కు అలా దొరికిపోయాడు

లాక్ డౌన్ వేళ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అంతేకాదు పలువురి పెళ్లిళ్లు కూడా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో  తన పెళ్లి వాయిదా వేయదలుచుకోలేదు ఓ యువ‌కుడు. అందుకోసం అత‌డు ఒక పెద్ద సాహసమే చేశాడు. పెళ్లికోసం ఏకంగా 850 కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కాడు. వివ‌రాల్లోకి వెళితే… ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సోనూ పని నిమిత్తం పంజాబ్‌లో ఉంటున్నాడు. అతడికి ఇప్పటికే  పెద్దలు ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది దీంతో పెళ్లి చేసుకోవడానికి […]

పెళ్లి కోసం 850కి.మీ సైకిల్ తొక్కాడు..చివ‌ర‌కు అలా దొరికిపోయాడు
Follow us

|

Updated on: Apr 19, 2020 | 2:22 PM

లాక్ డౌన్ వేళ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అంతేకాదు పలువురి పెళ్లిళ్లు కూడా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో  తన పెళ్లి వాయిదా వేయదలుచుకోలేదు ఓ యువ‌కుడు. అందుకోసం అత‌డు ఒక పెద్ద సాహసమే చేశాడు. పెళ్లికోసం ఏకంగా 850 కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కాడు. వివ‌రాల్లోకి వెళితే…

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సోనూ పని నిమిత్తం పంజాబ్‌లో ఉంటున్నాడు. అతడికి ఇప్పటికే  పెద్దలు ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది దీంతో పెళ్లి చేసుకోవడానికి పంజాబ్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు సైకిల్‌పై  బయలు దేరాడు. రాత్రింబవళ్లు సైకిల్‌ తొక్కుకుంటూ వారం రోజుల్లో ఏకంగా 850 కిలోమీటర్లు ప్రయాణించాడు. మరికొన్ని గంటలు సైకిల్‌ తొక్కితే ఇళ్లు చేరుకునే వాడు.. పెళ్లి జరిగేది. కానీ, ఇక్క‌డే దొరికిపోయాడు.

అయితే,  ఇంటికి మరో 150 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంది. సొంత జిల్లాలోకి ప్రవేశిస్తున్న సమయంలో సరిహద్దులో పోలీసులు అతడిని అడ్డుకున్నారు. అతడి నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అతడిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అతడికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు శాంపిల్స్ సేక‌రించారు. నెగిటివ్‌ అని తేలితే 14 రోజుల పర్యవేక్షణ అనంతరం ఇంటికి పంపుతామని స్పష్టం చేశారు. తాను పెళ్లి చేసుకుంటానని అతడు ఎంతగా విజ్ఞప్తి చేసినప్పటికీ పోలీసులు అతడిని వదల్లేదు.   దాంతో ఆ యువకుడు తీవ్ర నిరాశకి గురయ్యాడు. పాపం అతని కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో