‘గోవింద’ యాప్ ద్వారా త్వరలో శ్రీవారి సేవలు!

శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్తున్నారా? తిరుమలలో రూమ్ దొరుకుతుందో లేదో, దర్శనం ఎలా జరుగుతుందోనని అని టెన్షన్ పడుతున్నారా? భక్తులు ఇలాంటి ఇబ్బందులు పడకూడదనే సాంకేతికతను ఉపయోగించుకుంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం-టీటీడీ. తిరుమల భక్తుల కోసం గోవింద యాప్ రూపొందించింది. శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహం వ‌ద్ద 97 శాతం, ఎంబిసి వ‌ద్ద 100 శాతం స్వైపింగ్ ద్వారా లావాదేవీలు జ‌రుగుతున్నట్టు అధికారులు తెలిపారు. సాధార‌ణ గదుల కేట‌గిరీలో టీబీ కౌంట‌ర్‌లో 91 శాతం, స‌ప్త‌గిరి విశ్రాంతి […]

‘గోవింద’ యాప్ ద్వారా త్వరలో శ్రీవారి సేవలు!
Follow us

| Edited By:

Updated on: Oct 20, 2019 | 8:46 PM

శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్తున్నారా? తిరుమలలో రూమ్ దొరుకుతుందో లేదో, దర్శనం ఎలా జరుగుతుందోనని అని టెన్షన్ పడుతున్నారా? భక్తులు ఇలాంటి ఇబ్బందులు పడకూడదనే సాంకేతికతను ఉపయోగించుకుంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం-టీటీడీ. తిరుమల భక్తుల కోసం గోవింద యాప్ రూపొందించింది.

శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహం వ‌ద్ద 97 శాతం, ఎంబిసి వ‌ద్ద 100 శాతం స్వైపింగ్ ద్వారా లావాదేవీలు జ‌రుగుతున్నట్టు అధికారులు తెలిపారు. సాధార‌ణ గదుల కేట‌గిరీలో టీబీ కౌంట‌ర్‌లో 91 శాతం, స‌ప్త‌గిరి విశ్రాంతి గృహాల వ‌ద్ద 62 శాతం, సూరాపురంతోట‌, రాంభ‌గీచా, సిఆర్వో జ‌న‌ర‌ల్ వ‌ద్ద దాదాపు 50 శాతం న‌గ‌దు ర‌హిత లావాదేవీలు జ‌రుగుతున్నట్టు తెలియ‌జేశారు.

సీఆర్వో జ‌న‌ర‌ల్ వ‌ద్ద ముందు వ‌చ్చిన వారికి ముందు ప్రాతిప‌దిక‌న సామాన్య యాత్రికుల‌కు గ‌దులు కేటాయిస్తారు. ఇక్కడ ముందుగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. గ‌దుల కేటాయింపు స‌మాచారాన్ని సంబంధిత యాత్రికుల సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో పంపుతారు. ఆ ఎస్ఎంఎస్‌ను చూపి యాత్రికులు గ‌దులు పొందొచ్చు. అదేవిధంగా, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న‌వారికి, కాటేజీ దాత‌ల‌కు ఎఆర్‌పీ కౌంట‌ర్‌లో గ‌దులు కేటాయిస్తారు. సిఆర్వో వెనుక వైపు గ‌ల కౌస్తుభం కౌంట‌ర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖ‌ల‌పై గ‌దులిస్తారు. శ్రీ ప‌ద్మావ‌తి విచార‌ణ కార్యాల‌యం, ఎంబిసిలో ప్ర‌ముఖుల‌కు గ‌దులు కేటాయిస్తారు.

మూడు నెలల ముందు నుంచే ఆన్‌లైన్‌లో గ‌దులు బుక్ చేసుకోవ‌చ్చు. తిరుమ‌ల‌లోని మొత్తం 5 యాత్రికుల వ‌స‌తి స‌ముదాయాలున్నాయి. ఇక్క‌డ ఉచితంగా లాక‌ర్లు కేటాయిస్తారు. టీటీడీ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో సేవలన్నింటినీ గోవింద మొబైల్‌ యాప్‌లోనూ అందిస్తోంది. భ‌క్తుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా టీటీడీ చేస్తున్న మార్పుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు న‌వీక‌ర‌ణ చేయాల‌ని ఐటి అధికారుల‌ను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు.

గోవింద మొబైల్‌ యాప్ ద్వారా రూ.300 దర్శన టికెట్లు, ఆర్జితసేవలు, వస‌తి, త‌దిత‌ర సేవ‌ల‌ను ఆన్‌లైన్‌లో పొందేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్ రూపొందించిన‌ట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా తిరుమల యాత్రికుల సౌక‌ర్యాల‌కు సంబంధించి జ‌రుగుతున్న మార్పుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు యాప్ ద్వారా భ‌క్తుల‌కు తెలియ‌జేయాల‌ని ఆయన సూచించారు.

బాక్సాఫీస్ బిగ్ వార్.. . ఒకే రోజు బరిలోకి పుష్పరాజ్, భైరవ.?
బాక్సాఫీస్ బిగ్ వార్.. . ఒకే రోజు బరిలోకి పుష్పరాజ్, భైరవ.?
కార్తికేయ 3పై స్పందించిన నిఖిల్.. ఆ తర్వాతే సెట్స్ పైకి.?
కార్తికేయ 3పై స్పందించిన నిఖిల్.. ఆ తర్వాతే సెట్స్ పైకి.?
భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కారణమిదే..
భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కారణమిదే..
'పది' పరీక్షల్లో వింతలు.. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం
'పది' పరీక్షల్లో వింతలు.. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం
ముందు నుయ్యి వెనక గొయ్యి.. అనేలా దర్శకుల పరిస్థితి.. వారెవరంటే.?
ముందు నుయ్యి వెనక గొయ్యి.. అనేలా దర్శకుల పరిస్థితి.. వారెవరంటే.?
ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా.. కారునే హెలికాప్టర్‌గా మార్చేశారు!
ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా.. కారునే హెలికాప్టర్‌గా మార్చేశారు!
విమానాల టేకాఫ్‌ సమయంలో ఏసీలు ఎందుకు ఆఫ్‌ చేస్తారు?
విమానాల టేకాఫ్‌ సమయంలో ఏసీలు ఎందుకు ఆఫ్‌ చేస్తారు?
అందుకే బోల్డ్‌గా నటించా.. అసలు విషయం చెప్పిన అనుపమ
అందుకే బోల్డ్‌గా నటించా.. అసలు విషయం చెప్పిన అనుపమ
30 కిలోలు తగ్గిపోయి అస్తిపంజరంలా మారిన నటుడు..ఎవరో గుర్తుపట్టారా?
30 కిలోలు తగ్గిపోయి అస్తిపంజరంలా మారిన నటుడు..ఎవరో గుర్తుపట్టారా?
ముంబై స్టార్ పేసర్ ఔట్.. కట్‌చేస్తే.. బాబర్ ఆజాం ప్లేయర్ ఇన్
ముంబై స్టార్ పేసర్ ఔట్.. కట్‌చేస్తే.. బాబర్ ఆజాం ప్లేయర్ ఇన్