“లవర్స్ డే” రోజు ఫోన్ కొనివ్వలేదని… బాయ్ ఫ్రెండ్ చెంపలను..

Man in China gets slapped 52 times in public by girlfriend on Chinese “Valentine’s Day”, “లవర్స్ డే” రోజు ఫోన్ కొనివ్వలేదని… బాయ్ ఫ్రెండ్ చెంపలను..

లవర్స్ డే వస్తే చాలు.. అందరు తమ ప్రియురాళ్లకు బహుమతులు ఇస్తూ.. వారిని సంతోషపెడుతూ ఉంటారు. అయితే “లవర్స్ డే” రోజు గిఫ్ట్‌గా మొబైల్ ఫోన్ అడిగితే ఇవ్వలేదని.. ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్‌ను చెంపలు వాచిపోయేలా కొట్టింది. ఈ ఘటన చైనాలోని సిచువాన్‌ వీధిలో జరిగింది. అక్కడి స్థానికులను విస్మయానికి గురిచేసిన ఈ ఘటనపై ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకటికాదు, రెండు కాదు.. ఏకంగా 52 సార్లు ఆమె చెంపదెబ్బలు కొట్టింది. అయినా అతడు రాయిలా నిలబడ్డాడు తప్ప ఎదురు తిరగలేదు. దీంతో వారిని చూస్తూ.. అటుగా వెళ్తున్న జనాలంతా ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు. పోలీసులు వచ్చినా ఆమె అతడిని తిట్టడం ఆపలేదు. దీంతో ఇద్దర్నీ పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు అధికారులు ప్రయత్నించారు.

అయితే తన గర్ల్‌ఫ్రెండ్ ఇబ్బందుల్లో పడుతుందని భావించిన అతడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ వివాదంలో మీ జోక్యం అవసరం లేదనీ… తాను పరిష్కరించుకోగలనని పోలీసులకు పేర్కొన్నాడు. దీంతో పరిస్థితి శృతి మించకుండా పోలీసులు అక్కడున్న జనాలను చెదరగొట్టి అతడిని దూరంగా తీసుకెళ్లిపోయారు. ఇద్దరినీ విడివిడిగా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

అయితే పోలీసుల కథనం ప్రకారం ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని.. ఆర్ధికంగా అతడికి సాయం చేస్తూ వస్తున్న ఆ యువతి… ప్రేమికుల రోజు అతడు కొత్త ఫోన్ కొనివ్వకపోవడంతో కోపోద్రిక్తురాలైందని తెలిపారు. దీంతో తనకు తప్పు చేశానన్న భావన కలిగిందనీ.. ఆమె కోపం చల్లారేదాకా అన్నీ భరించాలని నిర్ణయించుకున్నట్టు అతడు తెలిపినట్లు వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *