మరోసారి ‘రియల్ హీరో’ అనిపించుకున్న మహేష్‌ బాబు.. ఏం చేశారంటే..!

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఏపీలో నెలల చిన్నారి.. గుండెకు సంబంధించిన అరుదైన వ్యాధితో బాధపడుతుందని తెలుసుకున్న మహేష్..

మరోసారి 'రియల్ హీరో' అనిపించుకున్న మహేష్‌ బాబు.. ఏం చేశారంటే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 25, 2020 | 3:55 PM

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఏపీలో నెలల చిన్నారి.. గుండెకు సంబంధించిన అరుదైన వ్యాధితో బాధపడుతుందని తెలుసుకున్న మహేష్.. ఆ చిన్నారికి ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుంటోంది. ఈ విషయంపై చిన్నారికి సర్జరీ చేసిన ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు మాట్లాడుతూ.. ”సర్జరీ నుంచి చిన్నారి కోలుకుంటోంది. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తాం. చిన్నారి తల్లిదండ్రులు మహేష్ బాబు టీమ్‌కు, వైద్యులకు తమ కృతఙ్ఞతలు తెలిపారు” అని వెల్లడించారు.

మరోవైపు నమ్రత సైతం తన టీమ్‌కి అభినందనలు తెలిపింది. అయితే మహేష్ బాబు ఇలా సాయం చేయడం ఇది తొలిసారేం కాదు. గతంలో చాలా మంది చిన్న పిల్లలకు ఆపరేషన్లు చేయించిన సూపర్‌స్టార్.. రియల్ లైఫ్‌లోనూ పలుమార్లు హీరో అనిపించుకున్నారు. ఆంధ్ర హాస్పిటల్స్‌లోని వైద్యుల సహాయంతో గుండె జబ్బుతో బాధపడుతున్న దాదాపు వెయ్యి మంది చిన్నారులకు ఆయన చికిత్స చేయించిన విషయం తెలిసిందే.

Read This Story Also: నోరు మూసుకునే కన్నా.. చావడం మిన్న: పీవీపీ సంచలన ట్వీట్