ధోని తెచ్చిన పేచీ.. అయోమయంలో సెలక్షన్ కమిటీ!

Mahendra Singh Dhoni Unlikely For West Indies Tour, ధోని తెచ్చిన పేచీ.. అయోమయంలో సెలక్షన్ కమిటీ!

ముంబై: ప్రపంచకప్ 2019 నుంచి టీమిండియా నిష్క్రమించిన సంగతి తెలిసందే. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు విఫలమైన మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి చివరి వరకు గెలుపు కోసం ప్రయత్నించారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత ధోని తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే నిర్ణయంపై ఇంకా సందిగ్ధంలో ఉన్న ధోనిని.. ఆగష్టు‌లో జరగబోయే వెస్టిండీస్ టూర్‌కు బీసీసీఐ ఎంపిక చేయకపోవచ్చని సమాచారం.

ఈ నెల 17, 18 తేదీలలో విండీస్ టూర్‌కు ఆటగాళ్లను నేషనల్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది. ఇక ఈ లిస్ట్‌లో ధోని పేరు ఉండకపోవచ్చని కమిటీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ధోని రిటైర్మెంట్‌పై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రపంచకప్ టీమ్‌లో ఉన్న దినేష్ కార్తీక్, రిషబ్ పంత్‌లను విండీస్ టూర్‌కు ఎంపిక చేస్తారని తెలుస్తోంది. కాగా రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా ఈ టూర్‌లో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. అటు ఈ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, బుమ్రా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్‌లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం లేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *